బడ్జెట్.. ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం దేశం ఆర్ధికంగా వెనుక ఉండిపోయింది. అలాంటి ఈ భారత్ కు ఎంతో అద్భుతమైన బడ్జెట్ రావాల్సి ఉంది. అయితే రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై మధ్యతరగతి ప్రజలకు, రైతులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. మధ్య తరగతి వారు ద్ర‌వ్యోల్బ‌ణంకు బ్రేక్ పడుతుంది అని ఆశిస్తున్నారు. 

 

ఇక మధ్య తరగతి మహిళలు అయితే.. కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా ఒక మహిళే కదా.. బంగారం తగ్గేలా ఏదో ఒక మార్గం తీసుకుంటుంది అని అనుకుంటున్నారు. ఇక నిరుద్యోగ యువత ఈ బడ్జెట్ వల్ల ఈ సంవత్సరం ఎక్కడో ఒక చోటా ఉద్యోగం వస్తుంది అని ఆశిస్తున్నారు. ఇంకా అందరూ అన్ని కోరికలు పెట్టుకున్నారు. 

 

అయితే ఇప్పుడు ఇక్క రైతులు కూడా ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? వారికీ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను సీతమ్మ తీర్చగలదు కానీ మరి తీరుస్తుందా? లేదా అనేదే ప్రస్తుతం ప్రశ్నార్ధకం. ఆ రైతుల కోరికలు ఏంటి అంటే? ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయాన్ని రూ.6వేల నుంచి రెట్టింపు చేయడం. 

 

ప్రధానమంత్రి సమ్మాన్ సహాయ నిధి మరింత మందికి విస్తరించడం అనే విష‌యాన్ని ఈ బ‌డ్జెట్‌లో పెడ‌తార‌ని రైతులు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపుపై కూడా స్ప‌ష్టత వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. ఇక‌,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల ఉపకార వేతనాల పెంపుపై కూడా ఈ బడ్జెట్ నిర్ణ‌యం కీల‌కంగా మార‌నుంది.

 

మరి సీతమ్మ రైతుల కోరిక తీరుస్తుందా? మధ్య తరగతి వారి భాదను వింటుందా? మహిళల బంగారం కోరిక తీరుస్తుందా? ఇది అంత రేపు బడ్జెట్ లో తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: