తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నది.  వైకాపా దీనికోసం కొత్త ఎత్తులు వేస్తున్నది.  ఇందులో భాగంగానే వైకాపా ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీని ఇప్పుడు అమలు చేసేందుకు రెడీ అవుతున్నది.  ఇంతకీ ఆ హామీ ఏంటి అనే డౌట్ వస్తుంది కదా.  అక్కడికే వస్తున్నా, 2019 ఎన్నికలకు ముందు వైకాపా అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేసే సమయంలో అనేక హామీలు ఇచ్చారు.  కృష్ణా జిల్లాలో అయన పాదయాత్ర చేసే సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు.  


కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు.  ఈ హామీని ఇప్పుడు నెరవేరుస్తారు లేదా అన్నది అందరిలో ఉన్న అనుమానం.  ఎందుకంటే, కృష్ణా జిల్లాను రెండు ముక్కలు చేశారు.  ఇందులో ఒకటి మచిలీపట్నం జిల్లాగా మార్చబోతున్నారు.  మచిలీపట్నం కిందకు నిమ్మకూరు ఉన్న గుడివాడ కూడా వస్తుంది.  అయితే, తాజా సమాచారం ప్రకారం మచిలీపట్నంకు అదే పేరు ఉంచాలని అనుకుంటున్నారు.  అదే పేరును ఉంచి కృష్ణా జిల్లాకు పేరు మార్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  


గుడివాడ మచిలీపట్నంలోకి వెళ్తుంది కాబట్టి మచిలీపట్టణంకు ఎన్టీఆర్ పేరు పెడతారా లేదంటే, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారా అన్నది తెలియాలి.  ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీని వైకాపా నెరవేరిస్తే కనుక టీడీపీకి పుట్టగతులు ఉండవు.  టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది.  తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నది.  ఇప్పుడు జరగబోతున్న ఈ వ్యవహారంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.  


ఒక వేళ ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోలేకపోతే, తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో పోరాటం చేసే అవకాశం ఉన్నది.  అమరావతి విషయంలో ఇప్పటికే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైకాపా, ఎన్టీఆర్ పేరు పెట్టకుండా వదిలేసినందుకు మరింత ఇబ్బందులు పడొచ్చు.  ఆంధ్రాలో ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన ఆశ్చర్యపోనవసరం లేదు.  మరి చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: