ఆడవారికి బంగారంపై ఎంత మమకారమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిన.. బయటకు వెళ్ళాలి అన్న.. మనం ఖచ్చితంగా ధరించేది బంగారం. ఎందుకంటే ఆడవారికి బంగారం ఇచ్చే మెరుపులు మారేది ఇవ్వలేదు కనుక.. అంతేకాదు ఇంట్లోకి కాస్త డబ్బు వచ్చిన బంగారం కొందాం అంటారు ఈ ఆడవాళ్లు. 

 

అలాంటి ఆడవాళ్లే ఇప్పుడు బంగారం కొనిస్త అన్నకూడా వెనకడుగు వేస్తున్నారు.. ఏం అంటే.. బంగారంపై ప్రేమ తగ్గి కాదు.. ఆ ధరకు బయపడి వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే.. మోదీ ప్రభుత్వం రెండొవసారి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బంగారం ధర 25 శాతం పెరిగింది. 

 

ఇంకా బంగారం కొనాలి అంటే ఎవరు మాత్రం భయపడరు? అందరూ బయపడుతారు... అయితే ఈ నేపథ్యంలోనే ఆడవారంతా కూడా బడ్జెట్ తర్వాత బంగారం కొందాం.. మన నిర్మల అక్క బంగారంపై కాస్త కరుణ చూపుతుంది అంటూ ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటికే బంగారం ధరలు ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. 

 

ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతాయి.. తగ్గేది అర్ధ రూపాయి అయితే పెరిగేది 10 రూపాయిలు. ఇలా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 24 క్యరెట్ల బంగారం ధర 42 వేల రూపాయిలు ఉంటె 10 గ్రాముల 22 క్యరెట్ల బంగారం ధర ఏకంగా 39 వేల రూపాయిలు ఉంది. ఇది ఈనాటి బంగారం ధర. 

 

ఈ క్ర‌మంలోనే మ‌హిళ ఆర్థిక‌ మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు ఏమైనా త‌గ్గుతాయేమోన‌ని దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు ఎదురు చూసే ప‌రిస్థితి నెలకొంది. ఎక్సైజ్ సుంకాన్ని కొద్దిగా త‌గ్గించినా చాల‌ని మ‌హిళ‌లు కోరుతున్నారు. మ‌రి ఆ రూపంలో వారికి ఊర‌ట ల‌భించేనా?  అసలు బంగారంపై నిర్మలమ్మకు ఏమాత్రం కరుణ ఉంది?... ఈ బడ్జెట్ తో బంగారం ధర ఎంత తగ్గనుంది అనేది చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: