కోటి ఆశలతో ఎదురు చూస్తున్న కోట్ల భారతీయుల ఆశలను తీర్చే విధంగా 17వ లోక్‌సభ బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో ఎన్నో విషయాలు ఆమె విశదీకరించారు, భారత దేశం అభివృద్ధిలో ముందు దూసుకుపోతోందని, ప్రస్తుతం 4.5 శాతంగా ఉన్న దేశ జీడీపీ రేటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6- 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు.

 

     వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి దిశగా కేంద్రం ముందు సాగుతోంది అని తెలిపారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వలన కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మల్లి గాడిలో పేట్టేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్పొరేట్ టాక్స్ తాగించిన కూడా కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టక పోవడం వెనుక కారణాలు పరిశీలిస్తున్నాం అని తెలిపారు. అధిక పన్ను విధించడం వలన ఆదాయ వృద్ధి సాధించలేమని, మూలధనం తగ్గింపు వల్ల దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు అని తెలిపారు.

 

        గత సంవత్సరం కన్నా ఆర్ధిక వ్యవస్థ పన్ను వసూళ్లు తగ్గించడం వలన ఆదాయం తగ్గొచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. భవన నిర్మాణ ధరలు పెరగడం వలన లోన్ లు ఇచ్చిన బ్యాంకుల  ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్‌షీట్లు ప్రక్షాళన కావొచ్చని ఆశించారు. పరిశ్రమ లో ఆర్ధిక వృద్ధి సాధించే దిశగా అనేక కార్యక్రమాలు రూపకల్పన జరిగిందని  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి 2.5 శాతంగా అంచనా వేశారు.
    

 

     2014  నుండి తగ్గుతూ వస్తున్న ధరల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చు అని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ కావొచ్చని అభిప్రాయ పడ్డారు. పొరుగుదేశమైన చైనా కు సమానంగా మన ఎదుగుదల జరుగుతోందని,  చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్‌గా అవతరించిందాని తెలిపారు. దేశంలో 2.62 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది అని ముందు ముందు ఉద్యోగ కల్పన పై అధిక దృష్టి ఉంచుతామని తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: