నేటి బడ్జెట్ ప్రారంభ విషయంలో జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక హోదాను రద్దుచేసి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది ఒక చారిత్రాత్మక విషయం ఇప్పుడు అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుతుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పుకొచ్చారు. అలాగే ఆర్టికల్ 370 ని రద్దు వలన జమ్మూ కశ్మీర్ లోని ప్రజలకు అన్ని సౌకర్యాలను అందచేయాలని అయన కోరారు. అలాగే అల్ప సంఖ్యాక వర్గాల ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను అయన చేయమని చెప్పారు. అలాగే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పలు చర్యలు చేపడుతున్నామని, అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా కూడా దేశంలోని కోట్లాది మంది రైతులకు లబ్ది పొందుతున్నారని అయన తెలుపారు.

 

ముఖ్యంగా దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు అసలైన న్యాయం జరిగిందన్నారు. ఆర్ధిక వ్యవస్థలో అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ లోనూ భారత్ ముందు వరుసలో సాగుతోందని అయన  ఉందన్నారు. ప్రపంచ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. 24 మంది పేదలకు బీమా సౌకర్యం కల్పించామని, ఈ ఏడాది కొత్తగా దేశంలో మరో 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశామన్నారు.

 

అలాగే దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, ప్రజలకు మేలుచేకూర్చే కొత్త కార్యక్రమాలను ప్రారంభించదని రాష్ట్రపతి సభాముఖంగా వివరించారు. అలాగే "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" మూల మంత్రంగా ప్రభుత్వం పనిచేస్తోందని అయన తెలిపారు. అలాగే నవ భారత్ నిర్మాణానికి మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు సాగుతున్నాయని అయన వ్యాఖ్యానించారు. ఇదంతా ఆలా ఉండగా మరో వైపు రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏను ప్రస్తావించడాన్ని విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: