బడ్జెట్ లో భాగంగా, శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టంతో చిరకాల కల నెరవేరిందని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రబీ, ఖరీఫ్ పంటల్లో రైతు పంటలకు మద్ధతు ధర ఇస్తున్నామని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతుల నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కిసాన్ సమ్మాన్ నిధితో 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత ర్యాంకు మరింత మెరుగుపడిందని పేర్కొన్నారు. 

 

ఇక కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దీంతో దేశంలోని సిక్కులు తమ పవిత్ర స్థలాన్ని సందర్శించే వీలు సుగమం అయ్యిందన్నారు. దేశంలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలు కూడా దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగా సమానహక్కులు పొందుతున్నారని చెప్పారు. అయితే మైనార్టీలను పాకిస్థాన్ టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. కానీ భారత్‌లో అన్ని మతాలవారు సమానమేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంతో మహాత్మాగాంధీ కన్న కల ఇన్నాళ్లకు నేరవేరిందని చెప్పారు. 

 

వున్నత విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా 65 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు. నన్‌కానా షాహిబ్ ఘటనను ఖండిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. పేదలందరికీ లబ్ది చేకూరలన్నదే ప్రభుత్వ అంతిమ ధ్యేయమని చెప్పారు. గత ఐదేళ్లలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంని చెప్పారు. వెనబడిన వర్గాలు ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చిందన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు. యూపీఏ ద్వారా రూ.2 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. 

 

చిట్టచివర మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నామని, వన్ నేషన్, వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చామని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ఉత్పత్తిలో భారత్ పుంజుకొంది. తమ 5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ కోసం ప్రభుత్వం ముందుడుగు వేస్తోందన్నారు. బాధితులకు సత్వర న్యాయం కోసం దేశంలో వెయ్యి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో దోషులకు సత్వరమే శిక్ష విధించే ఆస్కారం ఏర్పడిందని చెప్పారు. ఇటువంటి పరిణామాలు కేవలం మా ప్రభుత్వం హయాంలోనే జరిగాయని, జరుగుతాయని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: