ఏదైన పండ‌గ వ‌చ్చిందంటే చాలు దానికి సంబంధించిన ఫొటోను చాలా మంది వాళ్ళ సోష‌ల్ సైట్‌ల‌లో ప్రొఫైల్స్‌ను మార్చుతారు. అందులోను దేశానికి సంబంధించిన‌దైతే స్వాతంత్ర దినోత్స‌వ‌మో, గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌మో, లేక గాంధీ, నెహ్రూల పెట్టిన‌రోజు నాడో ఖ‌చ్చితంగా ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాల‌ను పెడుతుంటారు. లేదంటే జాతీయ జెండాను పోలిన దుస్తుల‌ను ధ‌రించి సంబర ప‌డ‌తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది, కానీ ఇంకో పని కూడా చేస్తారు, అదేంటంటే...

 


సోష‌ల్ సైట్ల‌లో వాళ్ళ సొంత ఫొటోల‌ను తీసేసి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటారు..! అవును, చాలా మంది అలా చేస్తారు క‌దా, అందులో త‌ప్పేముందీ, అని అనుకుంటున్నారా? అయితే మీరు అంటున్న‌ది క‌రెక్టే. కానీ.. కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. అవేమిటంటే…ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సైట్ల‌లో యూజ‌ర్లు ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోవ‌చ్చా, లేదా, పెట్టుకుంటే ఏమ‌వుతుంది..?  

 


ఈ ప్ర‌శ్న‌ల‌కు సమాధానంగా... జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటే నేరం చేసిన‌ట్టు అవుతుంద‌ని, The Prevention of Insults to National Honour Act, 1971 ప్ర‌కారం, FLAG CODE OF india, 2002 ప్రకారం శిక్షార్హుల‌వుతార‌ని అంటున్నారు. అయితే నిజానికి అలా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. సోష‌ల్ సైట్ల‌లో ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవ‌చ్చు. కానీ కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటించాలి. దేశ జాతీయ జెండా, జాతీయ చిహ్నం, జాతీయ గీతాల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా కానీ, మ‌రే విధంగా కానీ అవమానించిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తే అప్పుడు ఈ చ‌ట్టాల‌ ప్ర‌కారం శిక్షార్హుల‌వుతారు.

 

అదేవిధంగా జాతీయ జెండాను త‌గ‌ల‌బెట్టడం, నిర్దేశిత స‌మ‌యంలో కాకుండా వేరే స‌మ‌యంలో ఎగ‌రేయ‌డం, నాశ‌నం చేయ‌డం, చింపేయ‌డం, జెండాను అమ‌ర్యాద గా చూడటం, వస్త్రాలుగా కుట్టించుకోవ‌డం, లో దుస్తులుగా వాడ‌టం, క‌ర్చీఫ్‌గా వాడ‌టం, నాప్కిన్, కుష‌న్స్ గా వాడ‌టం, జాతీయ జెండాను నేల కు తాకించ‌డం, కావాల‌ని నీళ్ల‌లో త‌డ‌ప‌డం, జాతీయ జెండాను వెహికిల్, ట్రెయిన్, బ‌స్సు, బోటు లాంటి వాటి చుట్టూ అలంక‌రించ‌డం, జెండాను బిల్డింగ్ చుట్టూ క‌ట్ట‌డం లాంటివి చేస్తే మూడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష త‌ప్ప‌దంటున్నారు. అంతేకాక దానితో పాటు ఫైన్ కూడా ప‌డుతుంద‌ట‌. 


జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా సోష‌ల్ సైట్ల‌లో పెట్టుకోవ‌చ్చు. కాక‌పోతే అవ‌మాన ప‌రిచే రీతిలో ఆ ఫొటో ఉండ‌కూడ‌దు. రివ‌ర్స్ గా జెండాను పెట్టుకోవ‌డం, క‌ల‌ర్స్ మార్చ‌డం, జెండాను ఎడిట్ చేయ‌డం, జెండా ను వంక‌ర‌గా పెట్టుకోవ‌డం లాంటివి చేయ‌కుండా ఉన్న జెండాను ఉన్నట్టే ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటే ఎటువంటి స‌మ‌స్యా ఉండ‌దు. మ‌న‌దేశ జెండాను ముందు మ‌న‌మే గౌర‌వించుకోవాలి. బ్రిటీష‌ర్ల ద‌గ్గ‌ర నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డి మ‌న‌కు స్వాతంత్రం తెచ్చిన వారికి క‌నీస మ‌ర్యాద‌. మ‌న జెండాను మ‌న‌మే కాపాడుకోలేక‌పోతే ఎలా అంటున్నారు కొంద‌రు పెద్ద‌లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: