తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులే బహిరంగంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే తరుణంలో మరికొంతమంది మంత్రులు కెసిఆర్ ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రధాని అయితే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారని దేశం అబివృద్ది చెందాలంటే కెసిఆర్ ప్రదాని కావాలని, కెటిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ఆయన సూచించారు. కెటిఆర్ పనితీరు వల్లే స్థానిక ఎన్నికలలో ఇంతటి ఘన విజయం వచ్చిందని ఆయన అన్నారు.

 

వచ్చే నలభై ఏళ్లు తెలంగాణలో టిఆర్ఎస్ అదికారంలో ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ దేశ ప్రజలను విభజించే విధంగా కొత్త పాలసీలు తీసుకువస్తుందని కేవలం ఒక మతానికి కొమ్ము కాస్తూ మత రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని బిజెపి పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని ఇలా చాలా కామెంట్లు జాతీయస్థాయిలో వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కెసిఆర్ ప్రధాని అయితే నిజంగా బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పేర్కొంటున్నారు.

 

సెక్యులర్ భావాలు కలిగిన కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగిందని ఇప్పుడు అదే నినాదాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువచ్చి దేశంలో మరో ప్రత్యామ్నాయ కూటమి మోడీకి వ్యతిరేకంగా కడితే కచ్చితంగా కెసిఆర్ కి జాతీయ స్థాయిలో మద్దతు లభించడమే కాకుండా దక్షిణాది భారతదేశంలో జాతీయ రాజకీయాలను శాసించే కీలక నేతగా ఎదగటం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యాన్ ఆర్ సి, సి.ఎ.ఎ విధి విధానాలు తీసుకు వచ్చిన బీజేపీ సర్కార్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్...ఇలాంటి ఆలోచనలు వల్ల దేశం ఆర్థికంగా వెనుకబడి పోతుందని మాట్లాడుతూ... భవిష్యత్తులో కచ్ఛితంగా ప్రస్తుత విధి విధానాలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడం గ్యారెంటీ అని చెప్పడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో కెసిఆర్...కీలక నేతగా జాతీయ రాజకీయాల్లో రాణించాలని చాలా మంది కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: