దేశ రాజధాని ఢిల్లీలో కొన్నేళ్ళక్రితం 23 ఏళ్ల యువతిపై ఆరుగురు మృగాల్లాంటి మొగాళ్లు అతి దారుణంగా అత్యాచారం చేసి ఆమె మార్మాంగాల్లోకి పదునైన  వస్తువులు జొపించటంతో ఆమె తీవ్రంగా గాయపడి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులను శిక్షించడానికి ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన... ఇప్పటికీ ఈ ఘటన జరిగి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడింది లేదు. అయితే తాజాగా కూతురు నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన అప్పటికీ... ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. నిందితులు ఉరిశిక్షను వాయిదా వేసేందుకు కావాల్సిన అన్ని  మార్గాలను ప్రయత్నిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం హైకోర్టులో పిటిషన్ వేయడం లేదా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడం లాంటివి చేస్తూ ఉరిశిక్షను వాయిదా వేస్తూ వస్తున్నారు నిర్భయ ఈ కేసులో నిందితులు. 

 

 

 ఇలా వాయిదా పడుతూ వచ్చిన నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఉరి శిక్ష ... ఫిబ్రవరి ఒకటవ తేదీన అమలు  చేసేందుకు కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారైనా నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడుతుందా లేక మరోసారి వాయిదా పడి నిర్భయ కేసులో నలుగురు నిందితులకు పడాల్సిన ఉరి శిక్ష  వాయిదా పడుతుంద అని  దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కాగా నిర్భయ ఘటన జరిగిన నాటి  నుంచి నిర్భయ తల్లి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడేలా న్యాయ  పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 1న నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడాల్సి  ఉండగా తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది

 

 

 నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష పై పాటియాల కోర్టులో పిటిషన్ వేయగా... స్టే విధించింది. ఈ తమ ఊరిని వాయిదా వెయ్యాలి  అంటూ నిర్భయ కేసులో నలుగురు నిందితులు పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రేపు జరగాల్సిన నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు ఉరిశిక్షను వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పవన్ గుప్తా,  ముఖేష్ సింగ్,  వినయ్ శర్మ,  అక్షయ్ ఠాకూర్ లకు గురి మరోసారి ఉరి శిక్ష  వాయిదా పడింది. ఈ నలుగురు నిందితులకు ఉరి ఎప్పుడు అమలు చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఉరి  వెయ్యద్దు అంటూ కోర్టు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: