భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరోసారి హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. శనివారం, ఆదివారాల్లో ఆయన పర్యటన ఉండనుంది. రెండు రోజుల ముందు హైదరాబాద్ శివార్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభమైన సంగతి అందరికి తెలిసిందే. అయితే దీన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు.

 

అలాగే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామంలో హార్ట్‌ఫుల్‌ నెస్ ఇన్‌ స్టిట్యూట్‌ ను రాష్ట్రపతి కోవింద్ ప్రారంభించనున్నారు. శ్రీ రామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా మిషన్ న్యూగ్లోబల్ హెడ్ క్వార్టర్స్‌ లో శాంతివనాన్ని అయన సందర్శించనున్నారు. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 2వ తేదీన ఇన్‌ స్టిట్యూట్‌ ను ప్రారంభించనుండగా, ఫిబ్రవరి 1వ తేదీనే ఆయన హైదరాబాద్ రానున్నారు. దీనికోసం ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఈ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అయితే అఖిల భారతీయ గురుదేవ్‌ సేవా మండల్‌, గురుకుంజ్ ఆశ్రమానికి చెందిన జనార్థన్ పంత్ బోధి, సురేష్‌ ప్రభు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి రానున్నారు. హార్ట్‌పుల్‌ నెస్‌ ప్రథమ మార్గదర్శి లాలాజీతో పాటు హార్ట్‌పుల్‌ నెస్‌ ప్రస్తుత మార్గదర్శి కమలేశ్ పటేల్‌ ఈ కేంద్రాన్ని వారు జాతికి అంకితం ఇచ్చారు.

 

ఈ అద్భుతమైన ధ్యాన మందిరం నిర్మాణంలో మొత్తానికి ఒక సెంట్రల్‌ హాల్‌, ఎనిమిది సెకండరీ హాళ్లు ఉన్నాయి. ఈ ధ్యాన కేంద్రం మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఒకేసారి లక్ష మంది అభ్యాసీలు ధ్యానం చేసుకొనే వీలుంది. ఏ కేంద్రాన్ని కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేసారు. ఈ భవనం మానవ పరిణామానికి చిహ్నంగా ప్రపంచంలోనే విలక్షణమైన ఒక నిర్మాణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. మొత్తానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరోసారి హైదరాబాద్ పర్యటనకు వస్తుండడంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో తల మునకలు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: