ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 23 మంది చిన్నారులను పుట్టిన రోజు వేడుకలు అంటూ పిలిచి ఒక ఇంట్లో బందీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు హతమార్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫరుఖాబాద్ జిల్లాలో కలంకలం సృష్టించిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్చేశారు. దాని తర్వాత ఆ భాదిత పిల్లలను ఆ ఇంటి నుంచి సురక్షితంగా బయటకుతీసుకొచ్చారు. ఫరుఖాబాద్‌ జిల్లా మొహమూద్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథారియా గ్రామానికి చెందిన సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తి ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే తన కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో గురువారం మధ్యాహ్నం చుట్టుపక్కల ఉండే ఇళ్లల్లో 23 మంది చిన్నారులను ఆహ్వానించి వారందర్నీ తన ఇంట్లో బంధించాడు.

 

వారంతా రాత్రి పొద్దుపోయినా పిల్లలు ఇంటికి రాకవడంతో తల్లిదండ్రులు ఆ ఇంటికి వెళ్లగా వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. దీనితో ఆందోళన చెందిన పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ఉన్న ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా వారిపై గ్రనేడ్ విసిరి, నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు ఆ దుర్మార్గుడు. దీనితో ప్రత్యేక బృందాలు, తీవ్రవాద నిరోధక బృందం అక్కడకు చేరుకుని ఆ ఉన్మాదిని నిర్దాక్షణంగా కాల్చి చంపారు. ఈ ఆపరేషన్ కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ ఆధ్వర్యంలో కొనసాగింది.

 

అయితే, ఈ విషయం తీవ్ర ఉత్కంఠకు గురిచేయడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించడం ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం. ఈ ఘటన నుంచి చిన్నారుల క్షేమంగా బయటపడడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఆ తదుపరి నిందితుడి ఇంటి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితుడు జరిపిన కాల్పుల్లో మొత్తానికి ముగ్గురు గాయపడ్డారు. అయితే తన కుటుంబానికి "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన" కింద ఇళ్లు, ఇంకా "స్వచ్చ్ మిషన్" కింద టాయ్‌లెట్‌ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌‌‌ కు రాసిన లేఖను ఆ నిందితుడు ఇంటిలో నుంచి విసిరాడు. అయితే ఈ విషయంలో అధికారుల చుట్టూ తిరిగినా వారు పట్టించుకోలేదని ఆ అగంతకుడు ఆరోపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: