గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కమ్మ సామాజికవర్గ నేతల పెత్తనం బాగా సాగిన విషయం తెలిసిందే. చంద్రబాబు చుట్టూ గానీ, నియోజకవర్గాల్లో గానీ, ప్రభుత్వంలో గానీ వీరే పెత్తనమే ఎక్కువ ఉండేది. అయితే ఈ కమ్మ నేతలతో పాటు ఓ ఇద్దరు వియ్యంకుల హడావిడి బాగానే సాగింది. అప్పుడు మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, నారాయణలు వియ్యంకులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరు విద్యా శాఖ మంత్రిగా, మరొకరు మున్సిపల్ శాఖ మంత్రిగా బాబు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.

 

రాజకీయ పరంగా గంటా కీ రోల్ పోషిస్తే...నారాయణ అమరావతి విషయంలో అన్నీ తానై వ్యవహరించారు. వీరితో పాటు గంటా మరో వియ్యంకుడు భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కూడా బాగానే హడావిడి చేశారు. ఈ ఇద్దరంతా కాకపోయిన కాస్త ఆయన రేంజ్‌లో చేశారు. మొత్తం మీద ఈ వియ్యంకులు టీడీపీ ప్రభుత్వంలో అన్నీ పనులు బాగానే చక్కబెట్టుకున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడూ హడావిడి చేసిన వీరు..అధికారం పోగానే సైలెంట్ అయిపోయారు.

 

భీమవరంలో అంజిబాబు దారుణంగా ఓడిపోయాక అసలు బయటకు రావడమే మానేశారు. అటు నారాయణ నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయాక పార్టీలో కనబడలేదు. అయితే అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని రోజులు పార్టీ ఆఫీసులో కనిపించి, మళ్ళీ కనిపించడం మానేసి తన బిజినెస్ పనులు చూసుకుంటున్నారు. ఇటు గంటా మాత్రం తన వియ్యంకులు మాదిరిగా ఓడిపోకుండా, విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలిచి మరీ పార్టీ వైపు రావడం లేదు.

 

ఒకానొక దశలో టీడీపీ వీడతారని వార్తలు వచ్చిన, గంటా మాత్రం పార్టీ మారలేదు. అలా అని పార్టీలో కనబడరు. ఇక టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడాన్ని స్వాగతిస్తూ అప్పుడప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ముగ్గురు బంధువులు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని బాగా వాడుకుని...ఇప్పుడు సైడ్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: