బెడ్ రూమ్ లో ఉద్రేకంతో రెచ్చిపోయిన ఓ మహిళ బాయ్‌ ఫ్రెండ్‌ కి ముద్దుపెట్టి జైలుకి వెళ్లిన ఆశ్చర్యకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ముద్దుల దాడిలో ప్రియుడిని దారుణంగా గాయపరచడంతో పోలీసులు ప్రియురాలిని అరెస్టు చేసిన ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆవిడ ముద్దు ఘాటుకి ఆవిడకి ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్‌ లో వెలుగుచూసింది.

 

ఇక అసలు విషయానికి వస్తే మిచిగాన్‌ కి చెందిన యులెట్ వెడ్జ్‌ వర్త్ అనే 52 ఏళ్ల మహిళ కామోద్రేకంలో ప్రియుడిని తీవ్రంగా గాయపరిచింది. బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపించిన ప్రియురాలు స్మూచ్ కిస్ చేసింది. అయితే కాస్త ఆమె మొరటుగా ప్రవర్తించడంతో ఇప్పుడు ఆమె ఇబ్బందులు కొనితెచ్చుకుంది. ముద్దు పెడుతూ ప్రియుడి నాలుకను కొరికేయడంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడికి నోరంతా రక్తంతో నిండిపోయింది.

 

వెడ్జ్‌ వర్త్ కొరికిన దెబ్బకి ఆ బాధితుడి నాలుక ఒక అంగుళం మేర తెగి కిందపడిపోయింది. ఆ సదరు మహిళ మొరటు ప్రవర్తనని భరించలేని ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు బెడ్ రూమ్ లో సీన్ చూసి ఒకింత వరకు షాక్‌ కు గురి  అవ్వడం జరిగింది.  అక్కడ తెగిపడిన నాలుకను సేకరించి నోటి నిండా రక్తంతో బాధపడుతున్న బాధితుడిని ఆస్పత్రికి వారు తరలించడం జరిగింది.

 

వెడ్జ్‌ వర్త్‌ ని అరెస్టు చేసిన పోలీసులు ఆమెపై కేసుని నమోదు చేశారు. మిచిగాన్ చట్టాల ప్రకారం ఆమెకు ఏడాది జైలు శిక్షపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏడాది జైలుతో పాటు వెయ్యి డాలర్ల జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని అక్కడి చట్టాలు తెలియ జేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: