కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వెల్లపటూరు ప్రాంతంలో సమత అనే వివాహితపై  కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు మృగాళ్లు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ ఘటనకు 3 రోజులకు ముందు సమతా హత్య చారం హత్య ఘటన  జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సమంతా కేసులోని  నలుగురు నిందితులను ఉరి శిక్ష వేయాలంటూ  తెలంగాణ ప్రజానీకం నిరసనలు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదైన 45 రోజుల్లో అదిలాబాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముగ్గురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 

 

 

 అయితే సమత నిందితులకు ఇంకొన్ని రోజుల్లో  ఉరిశిక్ష పడనున్న  నేపథ్యంలో ఉరిశిక్షను ఎక్కడా అమలు చేయనున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉరిశిక్ష అమలు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1978లో చివరిసారిగా ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉరి శిక్ష అమలు చేశారు అధికారులు. ఆ తర్వాత నిందితులు ఎవరికీ ఉరిశిక్షలు పడకపోవడం.. కాలక్రమంలో ముషీరాబాద్ జైలు చెర్లపల్లికి  తరలిపోవడం... చర్లపల్లి జైలులో   ఉరికంబం ఏర్పాటు చేయక పోవడం జరిగింది. దీంతో తెలంగాణలోని ఏ కర్మాగారం కూడా ఉరికంభం లేకపోవడంతో ఉరి శిక్ష అమలు చేసేందుకు వీలు లేదు. 

 

 

 ఈ నేపథ్యంలో సమత కేసులో ముగ్గురు నిందితులను ఎక్కడ ఉరితీయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే అన్ని రాష్ట్రాల్లో నిందితులను ఉరితీయడానికి ఒక్కో జైల్లో  ఉరికంభం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉరికంభం ఉన్న జైలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. గతంలో జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సి వచ్చినప్పుడు  ఉరి కంబాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ ఇప్పుడు వరకు ఉరికంభం  ఏర్పాటు మాత్రం జరగలేదు. ఇకపోతే గతంలో ఉరిశిక్ష పడిన కొంతమంది దోషులను రాజమండ్రి జైలుకు తరలించి అక్కడ ఉరితీశారు. సమతా కేసులోని ముగ్గురు నిందితులను ఎక్కడ ఉరితీయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: