ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆప్ పార్టీ... బిజెపి పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బిజెపికి దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో విజయం సాధించి... 70 శాతం పైగా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బిజెపి అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. ఎలాగైనా ఈసారి దేశ రాజధాని ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలని సంకల్పంతో ముందుకు సాగుతుంది బిజెపి. 

 

 

 ఓటర్లను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓటర్లను  ఆకట్టుకునే విధంగా హామీలను పొందుపరిచి బిజెపి పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ సంకల్ప పత్ర పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ ప్రకాష్ జవదేకర్ హర్షవర్ధన్ పార్టీ ఢిల్లీ అధ్యక్షులు మనోజ్ తివారీ లు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల కార్యక్రమంలో ఢిల్లీ బిజెపి అధ్యక్షులు తివారి మాట్లాడుతూ ... ఢిల్లీలో బిజెపి పార్టీ గెలిస్తే కేంద్రంలో అమలవుతుంది ఆయుష్మాన్ భారత్ యోజన పథకం అమలు చేస్తామని ఆమె ఇచ్చారు. 

 

 

 అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ లు కొనిస్తామని...  పాఠశాల పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలు గోధుమలు కూడా కొనుక్కోలేని  దుస్థితి  ఏర్పడిందని ... ఇలాంటి పరిస్థితుల్లో తాము అధికారంలోకి రాగానే పేదలకు  రెండు రూపాయలకే  కిలో గోధుమపిండి సరఫరా చేస్తామని వెల్లడించారు. ఢిల్లీ లోని ప్రతి ఇంటికి రక్షిత నీటిని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఢిల్లీలో బుల్లెట్ ట్రైన్ లు కూడా ప్రవేశపెట్టి ప్రయాణ భారాన్ని తగ్గిస్తామని రైల్వే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు . తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ అభివృద్ధిని శరవేగంగా జరుపుతామని... ఢిల్లీ భవిష్యత్తు మొత్తం మార్చి వేస్తానంటూ హామీలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: