ఈరోజుల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే ఆడవారిపై ప్రైవేటు వాహనదారులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రైవేటు వాహనాలలో ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు. అయితే, కరీంనగర్ పోలీసులు ఈ భయాన్ని పోగొట్టేలా జనం యొక్క సేఫ్టీ నిమిత్తం ఒక విన్నూత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేటు వాహనాలకు ప్యాసింజర్ వెహికిల్ డిజిటలైజన్ విధానాన్ని నిన్న అనగా శుక్రవారం రోజున కరీంనగర్ కమిషనరేట్ ప్రారంభించారు. సో, సమీప భవిష్యత్తులో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేసే ఆటోల లాంటి ప్రైవేటు వాహనాలకు డిజిటల్‌ బోర్డు, క్యూఆర్ కోడ్ ను డాటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాయంతో ఏర్పాటు చేసేందుకు కరీంనగర్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.


ఇప్పటికే, ప్రైవేటు వాహనాలకు యూనిక్ నెంబర్ తో పాటు క్యూఆర్ కోడ్ ను కూడా అమర్చడం జరిగింది. డిజిటల్ బోర్డు ఒక్కటి ఏర్పాటు చేస్తే ఈ సౌకర్యాన్ని సాధారణ మొబైల్ ఫోన్ ఉన్నవారితో సహా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యూజర్స్ క్యూఆర్ స్కానర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని.. వాహనానికి అమర్చిన డిజిటల్ బోర్డుని, క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే ఆ వాహనాన్ని నడిపే వ్యక్తి యొక్క సమాచారం అంతా క్షణాల్లోనే తెలిసిపోతుంది. ఈ డిజిటల్ బోర్డు సహాయంతో ఎమర్జెన్సీ కాల్స్, టెక్స్ట్, కంప్లైంట్, ఇంకా రేటింగ్ కూడా ప్రయాణికులు ఇవ్వొచ్చు.


ఎమర్జెన్సీ కాల్ చేస్తే కమాండ్ కంట్రోల్ కి సమాచారం అందగా.. టెక్స్ట్ చేస్తే మాత్రం కమాండ్ కంట్రోల్ తో పాటు సమీపంలో ఉన్న పోలీస్ ఠాణాకు సమాచారం అందుతుంది. క్యూఆర్ కోడ్ ని వాహనం ఫ్రంట్ అద్దంపై, ఇంకా డ్రైవర్ సీట్ వెనుక అతికిస్తారు. ఇకపోతే, ఈ విధానాన్ని కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా సంతోషముగా ఆహ్వానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: