కరోనా వైరస్... ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి . ఎక్కడ తమ దేశంలోకి వచ్చే తమ ప్రాణాలను బలి తీసుకుంటుందో  అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మొదట చైనాలో గుర్తించిన కరోనా వైరస్ చైనాలో  అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే వందకు పైగా కరోనా  వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది కరోనా  వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇక ఈ వ్యాధి మిగతా దేశాలకు కూడా అతి వేగంగా విస్తరిస్తోంది. పలు దేశాలు కరోనా  అనుమానితులు కూడా ఉండడంతో  వారికి ప్రత్యేకంగా చికిత్స కూడా అందిస్తున్నారు. 

 

 

 ఇక భారతదేశంలో కూడా కేరళ రాష్ట్రంలో ఒక కరోనా వైరస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు అలెర్ట్  అయిపోయాయి. ముఖ్యంగా మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా కరోనా  వైరస్ అనుమానితులు  ఉండటంతో వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు. మొన్నటి వరకు హైదరాబాద్ లో  కరోనా వైరస్ అనుమానితులు వారి నుండి నమూనాలను స్వీకరించి... పూణే కి పంపేవారు. కానీ ఇప్పుడు కరోనా  వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి వ్యాధి నిర్ధారణకు అవసరమైన ద్రావకాలను  హైదరాబాద్ తెప్పించింది. 

 

 

 హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగాధిపతి నాగమణి నేతృత్వంలోని వైద్యబృందం.. పెర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ దరించి   స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం. గాంధీ ఆస్పత్రిలో ట్రయల్ రన్  రిపోర్టులు  పూణే వైరాలజీ రిపోర్థులు  సరిచూసి రిపోర్టులో జారీలో ఎలాంటి తేడాలు లేవని నిర్ధారించుకొని... ఆ తర్వాత కరోనా పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆస్పత్రిలో చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఎనిమిది మంది కారణం వైరస్ సోకినట్లుగా అనుమానితులు ఉన్నారు . వారికి ప్రత్యేక వార్డులో చికిత్సనందిస్తున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: