ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం దిన దినానికి టీడీపీని వెనక్కునెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే కోలుకొని విధంగా దెబ్బపడింది. వరస దెబ్బలతో బిక్కుబిక్కుమంటోంది. మూడు రాజధానులను అడ్డుకోవాలని చూసినా కుదరలేదు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నది. ఈ బలాన్ని ఉపయోగించుకొని మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకోవడమే కాకుండా, సెలక్ట్ కమిటీకి బిల్లును పంపించడంతో వైకాపా ప్రభుత్వం కక్షకట్టి ఏకంగా మండలిని రద్దుకు తీర్మానం పెట్టింది. ప్రస్తుతం రద్దు విషయం కేంద్రం కోర్టులో ఉన్నది.

 

ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మరింతగా అణగదొక్కేందుకు మరో ఎత్తును సిద్ధం చేసుకుంది వైకాపా. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది.  వారు పాదయాత్రలో హామీ ప్రకారం వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకుంటాడా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కృష్ణా జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారబోతున్నది.

 

మంచిలిపట్నంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం గుడివాడ మచిలీపట్నం జిల్లాలో భాగం కాబోతున్నది. అయితే, మచిలీపట్నం పేరును అలానే ఉంచుతారా లేదంటే ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తారా చూడాలి. పాదయాత్ర సమయంలో కృష్ణా జిల్లా అన్నారు కాబట్టి కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మారిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతమైన నిమ్మకూరు మచిలీపట్నంజిల్లాలో ఉంటుంది. ఒకవేళ మచిలీపట్నం ను ఎన్టీఆర్ జిల్లాగా మారిస్తే జగన్ కు తిరుగుండదు. తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ పడుతుంది. అలా కాకుండా ఇచ్చిన హామీని పక్కన పెడితే అది తెలుగుదేశం పార్టీకి ఆయుధంగా మారుతుంది. దీనిని ఉపయోగించుకొని వైకాపాపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: