ఎఫ్‌ఆర్‌డిఐ బిల్.. ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు. 2017లో ప్రజలు తమ భవిష్యత్‌ అవసరాల కోసం బ్యాంకుల్లో దాచుకుంటున్న డిపాజిట్లను అవసరమైతే బ్యాంకుల అవసరాల కోసం వినియోగించుకోవడానికి వీలుగా బీజేపీ ప్రభుత్వం ఈ ఎఫ్ఆర్డిఐ బిల్ ను తీసుకురావాలి అనుకుంది.

 

కానీ ఆలా తీసుకురావాలి అనుకున్నసమయంలో ఆ బిల్లుపై సోషల్ మీడియాలో.. తీవ్రంగా చర్చలు జరిగాయి. బ్యాంకుల పట్ల మధ్యతరగతి ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా బీజేపీ ప్రభుత్వం చేస్తోంది అని, ఈ బిల్లుతో బ్యాంకులకు అవసరమైన నిధుల సమకూర్చడం కోసం డిపాజిట్ల రూపంలో వున్న తమ సొమ్మును ఉపయోగించుకునే అవకాశాలు వుండడంతో మధ్య తరగతి ప్రజలు తమ డిపాజిట్లు ఎం అవోతాయో అని భయాందోళనకు గురయ్యారు. 

 

అయితే బ్యాంక్‌ దివాలా తీసే పరిస్థితిలో వున్నా లేదా పునర్వ్యవస్థీకరణకు నిధులు అవసరమైనా బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లను కేంద్రం వాడుకోవడం ఈ బిల్లు ముఖ్యోద్దేశంగా ఉండటంతో... 'జాతీయ ప్రయోజనాలు' పేరుతో ప్రజలపై మరింత ఆర్థిక భారాలను ప్రధాని మోడీ మోపుతున్నారు అని ప్రజల అనుమానాలు, భయాలు వ్యక్తం చేశారు. 

 

వ్యవస్థాగతంగా అత్యంత కీలకమైన ఆర్థిక సంస్థలు, చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికే ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును తీసుకువస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ ప్రజలు ఈ బిల్ పై తీవ్రంగా నిరసనలు చెయ్యడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో ఏడాది తర్వాత బిల్ ను ఉపసంహరించుకుంది. అయితే అప్పట్లోనే ఆ బిల్ ను ఉపసంహరించుకునే సమయం పార్లమెంట్ లో బిల్ ఉపసంహరించుకుంటూ ఆర్ధిక మంత్రి ఈ బిల్ మల్లి స్వల్ప మార్పులతో వస్తుంది అని.. మల్లి తెస్తాను అని చెప్పాడు. 

 

ఆలా చెప్పినట్టుగానే.. ఇప్పుడు ఈ ఎఫ్‌ఆర్‌డిఐ బిల్ కు కొద్దిగా రూపం మర్చి.. పేరు ఎఫ్‌ఎస్‌డిఆర్‌ 2019'గా అంటే ఫైనాన్సియల్ సెక్టార్ డెవలప్ మెంట్ అండ్ రెసొలుతిఒన్ గా మర్చి కాండ్ర కాబినెట్ ముందుకు వస్తుంది. అయితే కేంద్ర కాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలోనే ప్రవేశ పెడుతారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే.. అప్పట్లో ఉపసంహరించుకున్న 'ఎఫ్‌ఆర్‌డిఐ' బిల్ లో ఏలాంటి తప్పులు ఉన్నాయో... ప్రజలను ఏలాంటివి అయితే బయపెట్టాయో ఇప్పుడు వచ్చిన 'ఎఫ్‌ఎస్‌డిఆర్‌ 2019'లో కూడా అవే ఉన్నాయి. మరి ఈ ఎఫ్ఎస్డిఆర్ బిల్ వల్ల కూడా ఇలాంటి ఆందోళనలే జరుగుతాయా? అసలు ఎం జరగనుంది? అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: