ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆ షాక్ ఏంటి అంటే ?.. ఆ షాక్ గురించి మాట్లాడుకునే ముందు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుదాం. అవి ఏంటి అంటే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 

 

అది ఏంటి అంటే? ఒకే చోటా కొన్ని లక్షల కోట్లు పోసి అభివృద్ధి చేసేబదులు రాష్ట్రమంతా ఆ డబ్బు పోసి అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఆనందపడుతారు.. లాభ పడుతారు కదా ? అనే ఉద్దేశంతో సీఎం జగన్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో రాజధానులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

అయితే ఇది బేస్ చేసుకొని ప్రతిపక్షాలు చెలరేగిపోయాయి. అమరావతి ప్రజలను, రైతులను రెచ్చగొట్టి అన్యాయం జరుగుతున్నట్టు చూపించారు. అయితే ఈ నేపథ్యంలోనే కమిటీల నిర్ణయాలు కూడా రాజధాని తరలిస్తే బాగుంటుంది అని, ఆంధ్ర అభివృద్ధి అవుతుంది అని చెప్పనప్పటికీ ప్రతిపక్షం తగ్గకపోగా బిల్ ని మండలికి తీసుకెళ్లారు. 

 

అక్కడ మండలిలో అంత ప్రతిపక్ష నాయకులే ఉండటంతో మూడు రాజధానుల బిల్ ను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మండలి వల్ల అభివృద్ధి ఆగిపోతుంది తప్ప లాభ పడదు అని.. మండలిని రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.. అలానే రద్దు అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. 

 

అయితే ఈ బిల్లు ప్రస్తుతం కేంద్రానికి వెళ్ళింది. అయితే ఏపీ మండ‌లి రద్దు బిల్లుని నేడు జరిగే బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్రవేశ పెడుతారు అని అందరూ అనుకున్నారు.. కానీ ఆ అవకాశం ప్రస్తుతం లేదని పార్లమెంట్ అధికారులు చెప్పారు. దీంతో సీఎం జగన్ కు ఒకరకంగా మొదటి షాక్ తగిలింది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: