ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను అందించనుంది. ఇప్పటికే గ్రామ సచివాలయం వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కు సిద్ధం అయింది. ప్రజలకు సులభతరమైన అందించడంతోపాటు ప్రభుత్వం నుంచి సేవలు పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త సచివాలయం ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

అందులో భాగంగానే గ్రామ వాలంటీర్ల ను భారీ సంఖ్యలో రిక్రూట్ చేసుకుంది. తాజాగా రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించింది. ఏకంగా 63,000 పోస్టులను చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే పోస్ట్ ఎలా నింపాలి, ఏ తరహాలో భర్తీ చేయాలనే దానిపై అధికారులు ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికితోడు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయడంపై సమీక్ష నిర్వహించారు.

 

అయితే అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉంటే ప్రజలకు అందించడం కష్టమవుతుంది. అందువల్ల మొదటగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసి అనంతరం ప్రజలకు సులభతరమైన పాలనను అందించేందుకు జగన్ పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులను నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఏపీపీఎస్సీ ద్వారా 19 వేల పోస్టులు, డీఎస్సీ ద్వారా 21 వేల పోస్టులు, పోలీస్ శాఖలో 13 వేల ఉద్యోగాలను నింపేందుకు రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఖాళీ పోస్టుల భర్తీపై స్పష్టత రానుంది.

 

ఇదిలా ఉంటే ఉద్యోగాల క్యాలెండర్ మార్చిలో విడుదల చేయడంతో పాటు ఇప్పుడు ఏ పోస్టులను భర్తీ చేస్తారనేది ముందస్తుగానే నిరుద్యోగులకు సమాచారం ఇవ్వనున్నారు. క్యాలెండర్ ఆధారంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలు సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఆయా పోటీ పరీక్షల్లో సులువుగా ఉద్యోగం సంపాదించే పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ విషయంలో కాస్తంత వెనుకబడినా.. జగన్ అధికారం చేపట్టాక వాటన్నింటినీ తేటతెల్లం చేస్తున్నారని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: