కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగాన్ని కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో మొదలుపెట్టారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ తో ఆశించిన మేరకు ఉపాధి దొరుకుతుందని ఎస్సీ ఎస్టీల, మైనార్టీల, మహిళల ఆశలను నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉంటుందని ఈ బడ్జెట్ తో వ్యాపారాలు వృద్ధి చెందుతాయని ప్రజల ఆదాయాలను పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందని సంపదను సృష్టించడమే బడ్జెట్ యొక్క లక్ష్యమని అన్నారు. 
 
మంత్రి నిర్మలా సీతారామన్ విదేశీ పెట్టుబడుల లెక్కల గురించి వివరించారు. 280 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రపంచంలోనే భారతదేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. ఆయుష్మాన్ భవతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏప్రిల్ నుండి కొత్త జీఎస్టీ విధానం అమలులోకి రాబోతుందని చెప్పారు. భారత్ కు మరిన్ని పెట్టుబడులు రావాలని నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. 
 
మూడు లక్ష్యాలతో ముందుకు వెళుతున్నామని సబ్ కా సాత్, సబ్ కా వికాస్, న్యూ ఇండియా, ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో ముందుకు వెళుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్నులు దాఖలు చేశారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ అన్నారు. 
 
గత రెండేళ్లలో 16 లక్షల కొత్త పన్ను చెల్లింపుదారులు పెరిగారని జీఎస్టీతో ఆదాయం పెరిగిందని అన్నారు. ఒకే పన్ను, ఒకే దేశం మంచి ఫలితాలను ఇచ్చిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. బడ్జెట్ 2020లో అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా...? అనే ప్రశ్నకు సమాధానంగా లేదనే జవాబు వినిపిస్తోంది. ఊహించిన దాని కంటే పెట్టుబడుల లెక్కలు తక్కువగానే ఉన్నాయని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: