రైతులకు ఎప్పుడు మొండిచెయ్యే.. ఈ బడ్జెట్ తో అయినా రైతులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే.. ఎక్కడ? అసలు ఆ సిన్ ఏ లేకపోయే.. భారత్ అంత 2020 బడ్జెట్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన.. ఆలా చుసిన క్షణాలు రాణే వచ్చాయి.. వచ్చిన క్షణాల్లో విన్న బడ్జెట్ మాత్రం ఏమి బాగోలేదు.. 

 

2020 బడ్జెట్ తో మాకు న్యాయం జరుగుంది.. ఎప్పుడెప్పుడు అని ఈ బడ్జెట్ కోసం రైతులు ఎదురు చూశారు. కానీ కొందరి కలలు మాత్రమే నెరవేరయి.. చిన్న రైతుల గోశాను నిర్మలమ్మ ఏ మాత్రం పట్టించుకోలేదు. రైతే రాజు అనే దేశంలో చిన్న రైతులను ఇంత చిన్న చూపు చూస్తారా అని అంటున్నారు ప్రజలు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. ప్రపంచంలోనే భారత్ ఇదో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది అని చెప్పిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. కేంద్ర రుణభారం 48.7 శాతానికి తగ్గింది అని చెప్పారు. అయితే రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తాం అని ఆమె చెప్పారు. 6లక్షలకు పైగా రైతులు ఫసల్‌ బీమా యోజనతో లబ్ది పొందుతున్నట్టు ఆమె వివరించారు. 

 

సంపదను సృష్టించడమే లక్ష్యం అని, వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకం అమలు చేస్తాం అని ఆమె చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటాం అని,  వ్యవసాయ మార్కెటింగ్ విధానం మరింత సరళతరం అయ్యేలా చూస్తాం అని ఆమె చెప్పారు. 

 

ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి మూడు కొత్త చట్టాలు అమలులోకి తీసుకు వస్తున్నట్టు ఆమె వివరించారు. అంతేకాదు నీటి ఎద్దడి ఉన్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక సహాయం చేస్తాం అని ఆమె చెప్పారు. అయితే వీటి వ‌ల్ల చిన్న రైతుల‌కు ఎటువంటి ఉపయోగము లేదు.. దీంతో చిన్న రైతులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: