అక్కడ దేశ రక్షణ కోసం నిద్ర, ఆహారాలను మాని సైనికులు పోరాడుతారు. ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రత కోసం పోలీసులు రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమిస్తుంటారు. శాంతి భద్రతల కోసం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పటు పడుతున్నారు. మహిళా కానిస్టేబుల్ వారి సమస్యలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వాణాలు నిర్వహిస్తున్నారు. 

 

బందోబస్తు టైంలో కానీ, ఏదైనా ర్యాలీ సమయంలో కానీ మహిళా కానిస్టేబుల్ పరిస్థితి వర్ణ రహితంగా ఉంటుంది. వారికే ఎదురయ్యే సమస్యల గురించి ఎవరికి చెప్పుకోలేక వారిలో వారు సతమతమవుతుంటారు. అటు గొడవల సమయంలోను, ఇటు బందోస్తులోను, ర్యాలీ టైంలోను వారి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండడానికి వారికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చింది.  

 

బందోబస్తు సమయంలో క్షణం తీరిక లేకుండా నిలువు కాళ్ల జీతం చేసే మహిళా పోలీసులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రధానంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో లేక.. వారి బాధ వర్ణనాతీతం. ఆ సమస్యను దూరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మహిళా పోలీసుల కోసం మొబైల్‌ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్‌ టాయిలెట్లను మేడారం సమ్మక-సారలమ్మ జాతరలో వీటిని వినియోగించనున్నారు. డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీ ఓ మొబైల్‌ టాయ్‌లెట్‌ను ప్రారంభించారు. 

 

వాహనాల్లో మహిళా సిబ్బంది కోసం టాయ్‌లెట్లు, చేంజ్‌రూం, రెండు స్నానపు గదులు, రెండు వాష్‌బేసిన్లు, విశ్రాంతి గది ఉన్నాయి. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. 25 మొబైల్‌ టాయిలెట్లను తీసుకురావాలని నిర్ణయించామన్నారు. తొలి విడతగా 17 మొబైల్‌ టాయిలెట్లు  సిద్ధమయ్యాయని తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అదనపు డీజీలు జితేందర్‌, శివధర్‌రెడ్డి, సందీప్‌ శాండిల్యా, స్వాతి లక్రా పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్ సమస్యలను తెలుసుకొని  మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసినందుకు వారు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: