దేశ ప్రజలు అంత ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న బడ్జెట్ రానే వచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అయినా నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రెవేశపెట్టారు. కాగా ఆలా పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టె సంధర్భంగా నిర్మలమ్మ ఓ కవితను చదివి వినిపించారు. 

 

క‌శ్మీర్ పండిట్ దీన్‌నాథ్ కవిత‌ను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చ‌దివి వినిపించారు. ''నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం. మానవత్వం దయతో కూడిన సమాజం అవసరం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది'' అంటూ ఆమె కవితను చదివి వినిపించారు. 

 

అయితే అనంతరం నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో వృద్ది రేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుంది అని ఆమె అన్నారు. కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు చేరారు అని ఆమె చెప్పారు. ఏప్రిల్ నుంచి మరింత సులభంగా పన్ను చెల్లింపులు చేసేలా చేశామని చెప్పారు. 

 

ఈజ్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రతీ పౌరుడుకి చేరేలా చూస్తామని ఆమె చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది అని, జనం ఇప్పుడు బాగా బ్రతుకుతున్నారు అని కాశ్మీరీ పండిట్ దీనానాద్ కౌల్ కవిత ద్వారా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎలా అయితే కవిత చదివి వినిపించారో.. 

 

గత బడ్జెట్ లోను నిర్మల సీతారామన్ తమిళంలో కథ చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు కవితను చెప్పి ఆకట్టుకున్నారు. ఇలా ప్రతి బడ్జెట్ కు కథ.. లేక కవిత చెప్పడం నిర్మల సీతారామన్ బడ్జెట్ కు ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్ లో చెప్పిన కవితలనే బడ్జెట్ తో భారత్ కూడా వికసిస్తుందా? లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: