పార్లమెంటులో కాసేపటి క్రితమే పారంభమైన బడ్జెట్, మొదలవ్వడంతోనే రైతుల సంక్షేమాభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది. వ్యవసాయ రంగం బలపరిచే దిశగా దృష్టి సారిస్తామని, రైతుల ఆదాయాన్ని రెండింతల రెట్టింపు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని మెరుగు పరిచేందుకు 16 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ ను తెలియ జేశారు నిర్మల సీతారామన్.

 

ఇందులో ప్రధానమైనవిగా ఇన్సిపిరేషనల్ ఇండియా, ఎకనామిక్ డెవలప్‌మెంట్, సమాజ పరీరక్షణ..బడ్జెట్‌లో మూల స్తంభాలుగా ఉంటాయి... 2025 కల్లా దేశం నుంచి టీబీని పారదోలేందుకు చర్యలు కృషి ఉడాన్‌ను సివిల్ ఏవియేషన్ కూడా లాంచ్ చేస్తుంది. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారు ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికీ చేరేలా చేస్తామన్న నిర్మలా సీతారామన్ 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారు.  ఏప్రిల్‌లో సులభతరమైన జీఎస్టీ రిటర్న్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తాం అన్న నిర్మలా సీతారామన్.

 

ప్రపంచంలోనే భారత్ ను 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా తయారు చేసేలా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసారు... నిర్మలా సీతారామన్. అన్ని వర్గాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని, ప్రసంగించారు. 
జీఎస్టీ అంశంలో స్వర్గీయ అరుణ్ జైట్లీ ముందు చూపుతో వ్యవహరించారని, పార్లమెంట్‌లో మాజీ ఆర్థిక మంత్రికి నివాళి అర్పించారు. 2025 కల్లా దేశం నుంచి టీబీని పారదోలేందుకు కృషి చేస్తామన్నారు.

 

వ్యసాయానికి సంబంధించి 3 కొత్త చట్టాలను తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా.. నీటి ఎద్దడి వున్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్, 20 లక్షల మంది రైతులకు పోలార్ పంపు, 6 .11 కోట్ల మంది రైతులకు భీమా, వేర్ హౌస్ లకు జియో ట్యాగింగ్, నాబార్డ్ స్కీమ్ పొడిగింపు, కిసాన్ క్రెడిట్ స్కీమ్ నకు 15 లక్షల కోట్లు, మత్శ్యకారులకు సాగర్ మిత్ర పధకం ... ఇలా పలు రకాలైన పాయింట్లను రైజ్ చేస్తూ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: