కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే దేశం అభివృద్ధి దిశలో ముందుకు వెళుతుందని అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా పేదలకు అందే విధంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ అన్నారు. 
 
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. గ్రామీణ యువ రైతులకు సాగర్ మిత్ర పథకం ద్వారా మత్స్య పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ అన్నారు. మత్య సంపదల ఎగుమతుల లక్ష్యం 200 లక్షల టన్నులు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. చేపలు పట్టడంలో యూత్ కు శిక్షణ ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. 
 
ప్రత్యేక విమానాల ద్వారా కూరగాయలను, పండ్లను ఎగుమతి చేస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. నిర్మలా సీతారామన్ చెప్పిన సాగర్ మిత్ర పథకం, విమానాల ద్వారా కూరగాయల, పండ్ల ఎగుమతి వినడానికి బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యమా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేపలు పట్టడంలో యువతకు శిక్షణ ఇస్తామన్నా యువత ఆసక్తి చూపుతుందా అంటే అనుమానమే అని చెప్పవచ్చు. 
 
ప్రత్యేక విమానాల ద్వారా కూరగాయలు, పండ్లు ఎగుమతి చేయాలన్నా కూడా ఆచరణలో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి కేంద్రం బడ్జెట్ లో చెప్పిన ఆలోచనలను ఎలా అమలు చేస్తుందో చూడాల్సి ఉంది. గత బడ్జెట్ లో కూడా ఎన్నో హామీలను ఇచ్చిన కేంద్రం అందులో చాలా హామీలను అమలు చేయలేకపోయింది. ఈసారైనా కేంద్రం బడ్జెట్ లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: