జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకుని వెంటనే సినిమారంగంలో వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో జనసేన పార్టీకి చెందిన మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నిలకడ లేని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం వల్ల నాయకత్వం వల్ల రాజీనామా చేస్తున్నట్లు లెటర్ రాస్తూ...గతంలో పూర్తిగా రాజకీయాలు చేస్తాను ఇంకా సినిమాలు చేయను అని చెప్పి మళ్లీ సినిమాలు చేయడం బట్టి మీకు నిలకడలేని తత్వం ఉందని నాకు అర్థం అయిందని ఇందువలన నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కి లెటర్ పంపడం జరిగింది.

 

అంతేకాకుండా ఎలక్షన్ సమయంలో తనకు ఓటు వేసిన అండగా నిలిచిన ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలకు అలాగే ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఇటువంటి తరుణంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాసిన లెటర్ కొద్దిగా పవన్ కళ్యాణ్ లీడర్షిప్ నీ అవమానించే విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు.

 

కావాలని జనసేన పార్టీని చులకన చేయడానికి లక్ష్మీనారాయణ ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో ఉండే ఓ పార్టీ పెద్దల నుండి ఆదేశాలు అందుతున్నాయని ఆ విధంగానే ఆఫర్ కూడా వస్తున్నాయని ఇందువలన జనసేన పార్టీని ఏపీలో చులకన చేసి జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారని పవన్ కళ్యాణ్ సినిమాలు చేయటానికి ఆయన రాజీనామా చేయడానికి అసలు సంబంధం లేదని జేడీ లక్ష్మీనారాయణ రాసిన లెటర్ పై మండిపడుతున్నారు. అంతేకాకుండా జేడీ లక్ష్మీనారాయణ అంటే గతంలో గౌరవం ఉండేదని అయితే ఇప్పుడు ఆయన చేసిన చర్య వల్ల అది కూడా పోయిందని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: