కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన రెండవ బడ్జెట్ ను ప్రస్తుతం ప్రవేశ పెడుతున్నారు. ఈమె బడ్జెట్ స్పీచ్ ను దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు.

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల నగదు మొత్తం ప్రతి పేదవాడికి దక్కే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు చేపట్టారు. ఈ బడ్జెట్ అనేది కేవలం ఆదాయాన్ని పెంచడానికి.. ఇంకా అధికారాన్ని మెరుగుపరచడానికి అని చెప్పారు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్' అనే తమ నినాదం పేదలు ఇంకా వెనుకబడినవారి కోసం కొత్త కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రేరేపించిందని చెప్పారు.



ఉన్నత జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత అందరికీ ఆర్థికాభివృద్ధి ఈ బడ్జెట్ 2020 యొక్క మూడు లక్ష్యాలని నిర్మల సీతారామన్ చెప్పారు. కొన్ని కోట్ల మంది జనాలను పేదరికం నుండి బయటపడేలా చేసాము. ఇది మేము గర్వించదగ్గ విషయం అని ఉన్నారు. అదేవిధంగా "మన దేశం వికసించే తోట లాంటిది, దాల్ సరస్సుపై వికసించే తామర వంటిది, యువత వెచ్చని రక్తం లాంటిది. నా దేశం, మీ దేశం, ప్రపంచంలో అత్యంత ప్రియమైన దేశం" అని ఒక కాశ్మీరీ పద్యాన్ని నిర్మల సీతారామన్ ఆలపించారు.



ఉన్నత జీవన ప్రమాణాలు అనే లక్ష్యం రైతుల యొక్క ఆదాయాన్ని 2022లోపు రెట్టింపు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొరకు వ్యవసాయం, నీటిపారుదల మెరుగుపరచటం కూడా ఈ లక్ష్యం లోని ఒక భాగమే. 2006 నుండి 2016 వరకు 21 కోట్ల 7లక్షల మందిని పేదరికం నుండి గట్టెక్కించే లాగా చేశామని నిర్మల సీతారామన్ చెప్పారు.


2020 బడ్జెట్‌లో ఎనర్జీ సెక్టార్ కి 22 వేల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ .69,000 కోట్లు, స్వచ్ఛ భారత్ పథకానికి 2020-21లో రూ .12,300 కోట్లు నిర్మలా సీతారామన్ కేటాయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: