చైనాలోని వుహన్‌ నగరంలో బయటపడిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే చైనా దేశంలో దాదాపు రెండు వందలకు పైగానే ఆ దేశానికి చెందిన వాళ్ళు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా చైనా పక్క దేశాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మనిషి నుండి మనిషికి అంటురోగం గా వైరస్ వ్యాప్తి చెందే శక్తి కరోనా వైరస్ లో ఉండటంతో ప్రపంచ దేశాలు చైనా దేశం నుండి వచ్చే రాకపోకలను చాలా క్షుణ్ణంగా అత్యాధునిక పరికరాలతో వైద్య బృందం చేత విమానాశ్రయాల్లో పలు మార్గాల్లో వచ్చే ప్రతి వస్తువు ని మరియు అదే విధంగా వ్యక్తిని పరిశీలిస్తున్నాయి. ఆ తరువాత దేశంలోకి ఆయా దేశాలు రాణిస్తున్నాయి.

 

చైనాలోని వుహన్‌ నగరంలో బయటపడటంతో చైనా దేశంలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాలకు రాకపోకలను ఆపేశారు. ముఖ్యంగా చైనాలోని వుహన్‌ నగరానికి మిగతా రాష్ట్రాలకు అన్ని రాకపోకలు ఆగిపోయాయి. ఇటువంటి తరుణంలో అనేకమంది చైనీయుల ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ అరికట్టడానికి చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వైరస్ సోకిన ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేకమైన హాస్పిటల్లో కేవలం కరోనా వైరస్ సోకిన వాళ్లకి నిర్మించిన భవనంలో స్పెషల్ కండిషన్ రూమ్ లో రోగులను ఉంచుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ ప్రమాదకరమైన వైరస్ కి విరుగుడు కనుక్కోవడానికి ఆస్ట్రేలియా మరియు అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

 

ఈ తరుణంలో చైనా కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచంలోనే అపార కుబేరుడు గా పేరొందిన చైనా దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా కరోనా వైరస్ అంతమొందించడానికి చైనా ప్రభుత్వానికి ఇచ్చారు. అంతే కాకుండా ఇంకా అనేక మంది చైనా దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఆ దేశ ప్రభుత్వానికి విరాళంగా కోట్లు కుమ్మరిస్తూ ఉన్నాయి కరోనా వైరస్ ని అరికట్టడానికి.  

మరింత సమాచారం తెలుసుకోండి: