బడ్జెట్ విషయాలని ప్రభుత్వం ఈరోజు ప్రవేశ పెడుతోంది. ఇది వరస గా రెండో సారి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రేవేశ పెట్టడం. ఇది మాత్రమే కాదు ఈమెనే తొలి మహిళా ఆర్ధిక మంత్రి. అయితే బడ్జెట్ గురించి అనేక ప్రణాళికలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే దేశ ఆర్ధిక వృద్ధి తిరోగమనం లో ఉన్న సంధర్బం లో నిర్మలా సీతా రామన్ తన మేధస్సు తో నడవడం చూస్తున్నాం.
 
తాజాగా కేటాయించిన బడ్జెట్ విషయాలకి వస్తే భారత్ లో అనేక ప్రాంతాల వాసులకి ఫైబర్ నెట్ కోసం రూ.6000 కోట్లు అందజేయనున్నారని ప్రకటించారు. ఇలా ఒక్కొక్క రంగాన్ని దృష్టి లో పెట్టుకుని. ఓ ప్రణాళిక రూపం లో మన ప్రభుత్వం ఓ చక్కటి రూపు ని తీసుకుని రావడానికి కృషి చేస్తోంది. అన్నింటి కంటే ముఖ్యమైనది విద్య. అయితే విద్య అన్నింటి కంటే అధిక శాతం పాత్ర పోషిస్తుంది. ఇలా ముఖ్యమైన వాటిని అలానే ప్రతీ చిన్న వాటినీ కూడా వారు దృష్టి లో పెట్టుకుని పరిగణ లో కి తీసుకోవడం జరుగుతుంది. 
 
విద్యా రంగానికి వస్తే రూ.99,300 కోట్లు అని ప్రకటించారు. ఇదే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ విభాగానికి రూ.3000 కోట్లు కేటాయించడం జరిగింది. అలానే ఇండో-శాట్ ద్వారా ఉన్నత విద్య ల్లో విదేశాల్లో ఉన్న విద్యార్ధుల కి ఆసియా, ఆఫ్రికాల వారికి ముఖ్య్మ్ గా ప్రవేశం కలిపించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే కాకుండా అరోగ్య యోజన పధకం, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగు నీరు వంటివి పలు వాటికి ప్రకటించింది. 2030 నాటికి ప్రపంచం లో ఎక్కువ మంది శ్రామికులున్న దేశంగా భారత్ అని చెబుతున్నారు. నూతన ఎడ్యుకేషన్ పాలిసీ కూడా ప్రకటిస్తారు అని అన్నారు. విద్యా రంగం లో ఎఫ్.డి.ఐ ల కు అనుమతి కలిగిస్తారని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: