దేశ ప్రజలు అంత ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న బడ్జెట్ రానే వచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. అయితే ఈ బడ్జెట్ లో కొన్ని శాఖలకు వరాలపై వరాలు ఇచ్చారు కేంద్ర మంత్రి. అయితే విద్య రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటున్నాయి. 

 

అయితే విద్యారంగంలోనూ విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది కేంద్రం. అయితే భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం అనే 'ఇండ్‌శాట్‌' పరీక్షలను పెట్టనున్నారు. త్వరలో కొత్త విద్యా విధానం భారత్ కు రానుంది. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించారు. 

 

నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు చేశారు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు తీసుకు రానున్నారు. జిల్లా ఆస్పత్రులతో మెడికల్‌ కాలేజీల అనుసంధానం చెయ్యనున్నారు. విద్యా రంగానికి రూ.99,300 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నట్టు నిర్మల సీతారామన్ ప్రకటించారు. 

 

అంతేకాదు.. రూ. 3000 కోట్లు నైపుణ్యాభివృద్ధి కేటాయిస్తున్నట్టు ఆమె వివరించారు. అలాగే ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు.. విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతేకాదు... 2021 మర్చి నాటికీ అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. 

 

అయితే విద్య రంగంలోనూ విదేశీ పెట్టుబ‌డులు క‌ర‌క్టేనా అని అంటున్నారు నేటి తరం యువత.. అయితే ఇది కూడా ఒక రకంగా మంచిది మరో రకంగా ఇబ్బంది అని చెప్పచు.. ఎలా అంటే ? విద్య రంగంలో విదేశీ పెట్టుబడులు కారణంగా ఇక్కడ చదువుకునే పిల్లల ఫీజులు అధికం అవుతాయి.. దీని కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు వారి పిల్లలను చదివించడానికి ఇష్టపడరు. కొంతమేరకు ఇది నష్టం అనే చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: