నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూన్నారు. అంతకుముందు బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పనిదినంలో  ప్రవేశపెట్టగా ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కేంద్ర బడ్జెట్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు లోకి వస్తుంది. మరి ఈ కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి అనేది చాలా మంది ప్రజలకు తెలియదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర బడ్జెట్ అంటే.. వార్షిక ఆర్థిక నివేదిక ను ప్రవేశ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర బడ్జెట్ అనేది వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రభుత్వం చేసే ప్రకటన. కాగా ఈ కేంద్ర బడ్జెట్ను రెవిన్యూ బడ్జెట్టు మూలధన బడ్జెట్ రెండు రకాలుగా ఉంటుంది . 

 

 

 రెవెన్యూ బడ్జెట్... వార్షిక రెవిన్యూ బడ్జెట్లో ప్రభుత్వం యొక్క ఆదాయం వివరాలు ఉంటాయి. అలాగే పన్ను ఖర్చుల  వివరాలు కూడా ఆర్థిక బడ్జెట్  లో  ఉంటాయి. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చు సహా... పౌరులకు అందించే సేవలను అయ్యే ఖర్చును కూడా రెవిన్యూ బడ్జెట్ లో ఉంటుంది. ఒకవేళ రెవిన్యూ ఖర్చు ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానిని లోటు బడ్జెట్ పరిగణించాల్సి ఉంటుంది. 

 

 మూలధన బడ్జెట్... మూలధన బడ్జెట్ లో  ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించే రుణాలు... రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం తీసుకునే అప్పులు... విదేశాల నుంచి వెనక్కి తీసుకునే పెట్టుబడులు సహా ట్రెజరీ బిల్లులు,  చిన్న మొత్తాల పొదుపు,  సెక్యూరిటీ ప్రావిడెంట్ ఫండ్ లు,  ప్రత్యేక డిపాజిట్లు,  బడ్జెట్లు ప్రధానంగా ఉంటాయి. ఇక మూలధన వ్యయం  విషయంలో యంత్రాలు పరికరాలు భవనం ఆరోగ్య సౌకర్యాలు విద్య షేర్లు పెట్టుబడులు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ల తదితరులకు వచ్చే రుణాలు గ్రాంటు అడ్వాన్సులు మొదలైన వాటి  అభివృద్ధి అయ్యే  ఖర్చు వంటివి మూలధన వ్యయం లో ఉంటాయి. మూలధన వ్యయం ప్రభుత్వం మొత్తం ఆదాయాన్ని మించినప్పుడు ద్రవ్య లోటు ఏర్పడుతుంది. 

 

 

 ఇక వ్యయాలలో  కూడా రెండు రకాలు ఉంటాయి. ప్రణాళికా వ్యయం... ప్రణాళికేతర వ్యయం. కేంద్ర మంత్రిత్వశాఖ తో చర్చలు జరిపిన తర్వాత ప్రణాళికాబద్ధంగా ప్రతిపాదనలు ఖరారు చేస్తోంది. దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఖర్చుగా దీనిని పరిగణిస్తారు. ప్రణాళికేతర వ్యయం అంటే... ఎరువులపై ఇచ్చే సబ్సిడీ,  రుణాలపై,  వడ్డీ చెల్లింపులు,  కేంద్రపాలిత ప్రాంతాలకు గ్రాంట్లు పెన్షన్ వివిధ రంగాల్లో భద్రత ఆర్థిక సేవలు పన్నుల వసూలు తదితర అంశాలు ప్రణాళికేతర వ్యయం లోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: