ఇకపై న్యాయం కోరివచ్చేవాళ్ళు రాయలసీమ వెళ్లాల్సిందే. పరిపాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టే క్రమంలో ఇకపై కర్నూల్ కేంద్రంగా తీర్పులు వెలువడనున్నాయి. ఈ మేరకు ఓ నిసరాత్రి వేళ  రాష్ట్రాన్ని ఇక కుదుపు కుదుపే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచీ ఏపీ పాలనలో కీలక మార్పులు వచ్చినట్లే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం... రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుంచీ కర్నూలుకు తరలించినట్లైంది.

పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ఏపీలోని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల ఆఫీస్‌లను కర్నూలుకు తరలిస్తున్నట్టు అధికారిక సమాచారం. ఈ మేరకు ఏపీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఇకపై ఆ కార్యాలయాలు కర్నూలు నుంచీ పనిచేయనున్నాయి. ఐతే... మీకు తెలుసు ప్రభుత్వం ఒకే రాజధాని మూడు చోట్ల నుంచీ పాలన అన్న సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది.

దీన్నే కొందరు మూడు రాజధానులు అని కూడా అంటున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం... ఆల్రెడీ న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన ప్రభుత్వం... అందుకు తగ్గట్టుగానే... రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని కర్నాలుకు తరలించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉండగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక నిర్ణయంతో ఇవన్నీ కర్నూలుకు తరలించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. మొత్తంగా పరిపాలనా వికేంద్రీకరణ మొదలైనట్లే.

అర్థరాత్రి జీవో జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ అధికారికంగా మొదలైనట్లైంది. ఒకవేళ ఎవరైనా దీనిపై కోర్టుకు వెళ్తే... కోర్టుకు ఏం చెప్పాలనేదానిపై కూడా ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విభాగాలన్నింటికి అవసరమైన బిల్డింగ్‌లను ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖకు, కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా  హైకోర్టు అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించరాదని గతంలో న్యాయస్థానం హెచ్చరించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చీకటి నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: