దేశ ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చుసిన బడ్జెట్ ఎట్టకేలకు నేడు ప్రవేశపెట్టారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్ని రంగాలపై వరాల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె రైతులకు, మహిళలకు పెద్ద పీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చారు. అది ఏ పథకం అంటే.. ధాన్యలక్ష్మి పథకం. 

                                       

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు చెయ్యనున్నారు. ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం చేస్తామన్నారు. అంతేకాదు నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇక రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌హెచ్‌జీలకు సాయం చెయ్యనున్నారు. కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్‌ యోజన, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రవాణా సదుపాయం ఇస్తున్నారు. 

                                

కిసాన్‌ రైల్వే, కిసాన్‌ ఉడాన్‌ యోజన పథకాలు అమలు చెయ్యనున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం చెయ్యనున్నారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధులను కేటాయిస్తున్నారు. అంతే కాదు ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇలా గ్రామీణ మహిళలకు, రైతులకు పెద్ద పీట వేశారు. కాగా ఈ బడ్జెట్ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ రెండొవసారి ప్రవేశ పెట్టడంతో దేశ ప్రజలు అంత ఎంత ఉత్కంఠంగా చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: