కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాబోయే మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తీసుకొనిరానున్నట్టు చెప్పారు. ఈ మీటర్లు అందుబాటులోకి వస్తే మొబైల్ రీచార్జ్ లాగా విద్యుత్ బిల్లును కూడా ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా లేదా విద్యుత్ చెల్లింపు కేంద్రాల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. 
 
ఈ విధానం వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి వాడుకలోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో ఈ విధానం అందుబాటులో ఉండగా దేశవ్యాప్తంగా ఇకనుండి ఈ విధానం అమలులోకి రానుంది. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నేషనల్ గ్యాస్ గ్రిడ్ ను 16,000 కిలోమీటర్ల నుండి 27,000 కిలోమీటర్లకు పెంచే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో నూతన సంస్కరణలకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఓ.ఎఫ్.సీ ద్వారా లక్ష గ్రామాలకు డిజిటల్ టెక్నాలజీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటన చేశారు. లక్ష గ్రామాలకు జాతీయ గ్రిడ్ ద్వారా అనుసంధానం చేయనున్నట్టు ప్రకటన చేశారు. 
 
పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీలు, పోలీస్ స్టేషన్లకు డిజిటల్ అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారత్ నెట్ పథకాన్ని అమలులోకి తీసుకొనిరానున్నట్టు చెప్పారు. దేశంలో 2024 సంవత్సరం నాటికి కొత్తగా 100 విమానశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన చేశారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో గతంతో పోలిస్తే భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు ఎన్.ఆర్.ఐ లకు అవకాశం కల్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: