దేశ ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చుసిన బడ్జెట్ ఎట్టకేలకు నేడు ప్రవేశపెట్టారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్ని రంగాలపై వరాల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఆ గుడ్ న్యూస్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. 

 

అంత అద్భుతమైన గుడ్ న్యూస్ ఈసారి ఉద్యోగులకే సొంతం అయ్యింది. యేడాదిఏడాదికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 20 శాతం ఉన్న ప‌న్ను 10 శాతానికి త‌గ్గించారు అంటే చిన్న గుడ్ న్యూస్ అ? అయితే ఉద్యోగులకు వారి జీతాల బట్టి పన్ను ఏ ఏ శాఖలకు ఎంత ఎంత ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

సంవత్సరానికి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉండే ఉద్యోగికి ఏలాంటి ప‌న్ను ఉండదు. అలానే 5 నుండి 7.5 ల‌క్ష‌లు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను, 7.5 లక్షల నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటే 15 శాతం పన్ను, 10 ల‌క్ష‌ల నుంచి 12.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉంటె 20 శాతం పన్ను, 12.5 లక్షల నుంచి 15 ల‌క్ష‌లు వరుకు ఆదాయం ఉంటె 25 శాతం పన్ను.. అంతకు మించి అంటే రూ.15 లక్షలపైగా ఆదాయానికి ఆదాయపన్నును 30 శాతంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

 

ఈ న్యూస్ విన్న ఉద్యోగులకు పండుగ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఉద్యోగులకు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 10 శాతం పన్ని తగ్గింది. అయిత ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. కాగా ఈ బడ్జెట్ సామాన్యుల కోసమే అని ఆమె చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: