తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా  ప్రస్తుతం భయంకరంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటుగా అతి తక్కువ అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలు గెలవడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీని నడిపించడంలో విఫలమవుతున్నారు. పైగా వయసు మీద పడటం తో మరోపక్క ప్రతిపక్షంలో కూడా సరైన బలం లేకపోవడంతో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన రాజధానుల విషయంలో చంద్రబాబు అమరావతి కి సపోర్ట్ చేయడం తో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే పరిస్థితికి ఏర్పడింది.

 

మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలు కూడా తాజాగా 3 రాజధాని విషయంలో చంద్రబాబు అమరావతి కి సపోర్ట్ చేయడం తో ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుని ...ఆ ప్రాంతంలో ఉన్న నేతలంతా తెలుగుదేశం పార్టీ నాయకులపై చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అడ్డుకుంటున్నారని కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సమాధి కట్టడానికి రాజకీయంగా చంద్రబాబుకి చెక్ పెట్టడానికి ఉత్తరాంధ్ర ప్రజలు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.

 

కేవలం చంద్రబాబు అమరావతి ప్రాంతానికి పరిమితమయ్యారని..అటువంటి వ్యక్తిత్వం స్వార్థ మున్న చంద్రబాబుని ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని, విశాఖ పరిపాలనా రాజధానిగా వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆదరించిన ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, దమ్ముంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లామని వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సవాలు విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: