ఇటీవల కాలంలో బ్యాంకు ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. బడా పారిశ్రామికవేత్తలు కొందరు భారీగా లోన్లు తీసుకుని బ్యాంకులకు టోపీలు పెడుతున్నారు. ఈ సమయంలో ప్రజలకు బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్ము భద్రతపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ ఓ భరోసానిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బ్యాంకులో ప్రజల డిపాజిట్లకు ఇన్యూరెన్స్‌ను పెంచారు. 

 

డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఇప్పటి వరకు బ్యాంకులో మనం డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత ఉన్నా దివాళా తీసే పరిస్థితి వస్తే రూ.1 లక్ష వరకు బీమా ఇచ్చేదని చెప్పారామె. అయితే ఈ ఇన్సూరెన్స్‌ను ఇకపై రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిాపారు ఆర్థిక మంత్రి. అంటే ఇకపై ఏవైనా బ్యాంకులు దివాళా తీస్తే వస్తే రూ.5 లక్షల వరకూ డిపాజిట్ చేసి ఉన్న వారికి ఆ మొత్తం సొమ్మును ప్రభుత్వం వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ అందజేస్తుంది. అయితే అంతకన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఉన్నా సరే రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి.

 

ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి బడ్జెట్‌లో రూ.3,50 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్‌ ప్రసంగిస్తూ...బ్యాంకింగ్‌ రంగంలో 
పెను మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణ పునరుద్ధరణ గడువును 2021వరకు పొడగించినట్లు ప్రకటించారు. దీని ద్వారా 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.

 

స్వచ్ఛమైన, అవినీతరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్షమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పన్నుల పేరుతో వేధింపులను కేంద్రం ఉపేక్షించదన్నారు. ‘అవినీతి రహిత భారత్‌’  తమ ప్రభుత్వ నినాదమని మంత్రి తెలిపారు. పారిస్‌ పర్యావరణ ఒడంబికకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నగరాల్లో పరిశుభ్రతమైన గాలి కోసం రూ.4400 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్‌ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్‌ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: