ఎంతో మంది మధ్య తరగతి వారి జీవితాల్లో వెలుగులు నింపిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనగా ఎల్ఐసి కి ఇక కాలం చెల్లినట్లేనా? ఎల్ఐసి తర్వాత అనేక జీవిత బీమా పాలసీలు వచ్చినా కూడా అందరికీ గుర్తుండిపోయేది మాత్రం ప్రజా అనుబంధ సంస్థ మాత్రమే. ఆఖరికి మిగతా బీమా కంపెనీలు కూడా ఎల్ఐసి అన్న పాపులర్ పేరును వాడుకొని నడుస్తూ ఉంటాయి. అదే మొట్టమొదటి సారి వచ్చినప్పటినుంచి ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఆకస్మిక మరణం వల్ల కూలిపోకుండా కాపాడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైందని నేపథ్యంలో అందరిలో చాలా అనుమానాలు నెలకొన్నాయి

 

దేశీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ ఐసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా..కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఎల్ ఐసీ వాటలను కూడా విక్రయించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

 

అలాగే దానితోపాటు ఐడిబిటీ అమ్మకానికి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇకపోతే త్వరలోనే స్టాక్ మార్కెట్ లిస్టింగ్ లో ఎల్ఐసి విక్రయాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2020-21 నాటికి రూ.2.1 లక్షల కోట్లు పెట్టుబడులు ఉపసంహరణ లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. లక్ష కోట్ల రూపాయల విశ్లేషకుల అంచనాలకు మించి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏడాదిలో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.18, 094.59 కోట్లను ఉపసంహరించుకుంది. అంతకు ముందు ప్రైవేటీకరణకు గురైన  ప్రభుత్వ అనుబంధ సంస్థల గతి ఏమైందో మనందరికీ తెలిసిందే. దీంతో మొత్తానికి జీవిత భీమా సంస్థకు చరమగీతం పాడేసినట్లే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: