నేడు పార్లమెంట్ వేదికగా  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా దేశ ప్రజానీకం మొత్తం కేంద్ర బడ్జెట్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కేంద్ర బడ్జెట్లో వివిధ శాఖలకు ... వివిధ రంగాలకు  రంగాలకు ఎంత మేర నిధులు కేటాయింపు  ఉంటుంది  అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల కు సరిపడా నిధులు కేంద్రం కేటాయిస్తుందా  లేదా అనే దానిపై ఎంతో ఆశగా కేంద్ర బడ్జెట్పై ఎదురుచూస్తున్నారు. కాగా నేడు పార్లమెంట్ వేదికగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ లో దేశవ్యాప్తంగా వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేశారు. 

 

 

 పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాత సుఖీభవ అన్నట్లుగానే ఉంది. వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయం చేసే రైతులకు అన్ని రూపాల్లో మేలు జరిగే విధంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు ప్రకటించింది. గ్రామాభివృద్ధి వ్యవసాయం వ్యవసాయా  అనుబంధ రంగాలకు 2.83 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం 15 లక్షల కోట్ల నిర్ణయించడం వల్ల దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులందరికీ ఎంతో మేలు జరిగనుంది . అంతేకాకుండా రైతులకు 20 లక్షల సోలార్ పంప్ సెట్ లో పంపిణీ బీడు భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు... రసాయన ఎరువులు నుంచి విముక్తి పొంది సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించేలా   ప్రకటనలు చేశారు. 

 

 

 

 అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని నిలువచేసే గిడ్డంగులను నిర్మాణానికి  నాబార్డు  పీపీపీ పద్ధతిలో సాయం అందించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.  ఉద్వాసన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించటం ... వర్షబావ జిల్లాలకు  సాగునీటి సదుపాయం కల్పనకు అదనపు నిధులు మంజూరుకు బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధికి 1.23 వేల కోట్లు.. 6.11 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పై  రైతులకు రుణాలు మత్స్యకారులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ ఏడు  బడ్జెట్ రైతులకు ఎంతో మేలు చేకూరేల  విధంగా ఉంది అనటంలో  సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: