కేంద్ర బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ నిరాశే ఎదురయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-2021 బడ్జెట్‌లో కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల ఊసేలేదు. పెండింగ్‌ ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకురాకపోగా.. ఇప్పటికే ప్రారంభమైనవాటికి మొండిచేయి చూపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలైన దుగరాజుపట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమలను ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అవసరమైన ప్రధాన ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి పెరుగుతోంది. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో చోటు దక్కలేదు. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రూ.100 కోట్లు, మలి ఏడాది రూ.150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం లేదు. 2019-20 వార్షిక బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు ఉంటాయని జల వనరుల శాఖ ఆశించి భంగపడింది. ఇక 2020లో అయితే పోలవరం ప్రస్తావనే లేకుండా పోయింది. 

 

బడ్జెట్లో తమకు అన్యాయం జరిగిందని కేంద్రంపై ఏపీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం గతంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా మారుతోంది. చంద్రబాబు హయాంలో 4,329 కోట్ల రూపాయలు కేటాయించింది కూడా. ఏపీ వేల కోట్లు రావాలని ఆశిస్తుండగా.. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం నిరుత్సాహానికి గురి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని జగన్‌ ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే 2018-19లో ప్రాజెక్టు కోసం రాష్ట్రం వ్యయంచేసిన రూ.5,400కోట్లలో రూ.1,850 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు జూన్‌ నుంచి కేంద్రం చెబుతూ వచ్చింది. 

 

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,400 కోట్లలో రూ.1,850 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేసింది. 2018-19లో రాష్ట్రం ఖర్చుచేసిన రూ.1,850కోట్లను 2019-20లో తిరిగి చెల్లించింది. ప్రధానమంత్రి కిసాన్‌ సంచాయి యోజనలో భాగమైన సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం కింద జలశక్తి శాఖ ఈ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపింది. 2014 తర్వాత రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం చేపడుతున్న వ్యయాన్ని రీయింబర్స్‌ చేయడంలో భాగంగా ఈ రూ.1,850 కోట్లను విడుదల చేశామని జలశక్తి శాఖ తన లేఖలో పేర్కొంది. ఈ నిధుల కోసం ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. ఒకే కాంట్రాక్టు సంస్థ బిడ్‌ను దాఖలు చేయడంతో.. రీటెండర్‌గా ఖరారు చేసింది. కొత్త కాంట్రాక్టు సంస్థ గత నవంబరు 1నుంచి పనులు చేపడుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి 2020-21 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. 2018-19లో ప్రాజెక్టు కోసం రాష్ట్రం వ్యయంచేసిన రూ.5,400కోట్లలో రూ.1,850 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు గతేడాది నుంచి కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే 2014కి ముందు ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం తాలూకు ఆడిట్‌ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే తాజాగా నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ లో పోలవరం ఊసే లేకపోవడంపై ఏపీ ప్రభుత్వం పెదవి విరుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: