నేడు పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2020 వార్షిక బడ్జెట్ను ప్రకటించారు. ఈ సందర్భంగా చేయూతనిచ్చేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ లో  కీలక నిర్ణయాలను ప్రకటించారు . ఈ సందర్భంగా బ్యాంకు డిపాజిట్ దారులకు శుభవార్త వినిపించారు. ముఖ్యంగా పార్లమెంట్ వేదికగా నిర్మల సీతారామన్ డిపాజిట్ లకు సంబంధించి చేసిన ప్రకటన మధ్యతరగతి ప్రజలకు శుభవార్త అనే  చెప్పాలి. వార్షిక బడ్జెట్లో డిపాజిట్లపై ప్రకటనతో మధ్యతరగతి ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు డిపాజిట్ల పై ఇన్సూరెన్స్ కవరేజ్ ని ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ఇప్పుడు వరకు ఈ బీమా ప్రీమియం సౌకర్యం  ఒక లక్ష వరకు మాత్రమే పొందే వీలు ఉండేది. కానీ ఇప్పుడు డాన్ని  ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ బడ్జెట్ ప్రకటనలో నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ఈ ప్రకటనపై  దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు . బ్యాంకులు ఖాతాదారులకు సొమ్ము చెల్లించడంలో విఫలం అయినప్పుడు ఈ మేరకు బీమా సౌకర్యం వర్తింప చేస్తారు అని పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. 

 

 

 ఈ బీమా సౌకర్యం వర్తింప చేసేందుకు ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు . బ్యాంకులు చెల్లించే ప్రీమియం తోనే నిర్దేశిత గరిష్ట మొత్తం మేరకు భీమా  లభిస్తుంది అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటు వేదికగా నిర్ణయించారు. పొదుపు, రికవరీ,  కరెంట్ అకౌంట్ లు  ఫిక్స్డ్ డిపాజిట్లపై, ఈ బీమా ను ఖాతాదారులు పొందవచ్చు. ఈరోజు భిమాను  ఆర్బీఐకి చెందిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఖాతాదారులకు అందజేస్తుంది.కాగా ఈ ప్రకటన పై  ఖాతాదారుని మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: