కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది . పార్లమెంట్ లో 2020 వార్షిక బడ్జెట్ ప్రసంగం లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు . ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ ఐ సి వాటాలను కేంద్రం అమ్మకానికి పెట్టింది . దీనితో త్వరలోనే స్టాక్  మార్కెట్ లో  ఎల్ ఐ సి లిస్టింగ్ కి రానుంది . ఎల్ ఐ సి తన హోల్డింగ్ లోని కొంత భాగాన్ని  ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది .

 

 ఇక ఆదాయపన్ను  పలు  శ్లాబులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . ఆదాయపన్ను శ్లాబులను పెంచారు . దీనివల్ల కేంద్ర ప్రభుత్వం 40 వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోనుంది . రెండున్నర లక్షల రూపాయల వార్షిక వేతనం  కలిగిన వారు  ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు . రెండున్నర నుంచి ఐదు లక్షల వరకు వార్షిక వార్షిక వేతనం పొందే వారు ఐదుశాతం పన్ను చెల్లించాల్సి ఉండగా , ఐదు నుంచి ఏడున్నర లక్షల ఆదాయం కలిగిన వారు పదిశాతం పన్ను చెల్లించాలి . ఏడున్నర నుంచి పదిలక్షల ఆదాయం కలిగిన వారు 15 శాతం , 10 నుంచి 12. 5 లక్షల ఆదాయం కలిగిన వారు 20 శాతం , 12.5 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం కలిగిన వారు 25 శాతం , ఆపైన వార్షిక వేతనం పొందేవారు 30 శాతం పన్ను చెల్లించాలని కేంద్రం వెల్లడించింది .

 

అయితే గతం లో ఐదు నుంచి ఏడున్నర లక్షల వేతనం పొందేవారు 20 శాతం , ఏడున్నర నుంచి 10 లక్షల పొందేవారు కూడా 20 శాతం పన్ను చెల్లించేవారు . 10 నుంచి 12. 5 లక్షల వేతనం పొందేవారు , 12. 5 లక్షల నుంచి 15 లక్షలు , ఆపైన ఆదాయం పొందేవారు కూడా 30 శాతం చెల్లించాల్సి ఉండేది . గతంలో కేవలం రెండు శ్లాబుల విధానం ఉండగా , ఇప్పుడు ఆ విధానాన్ని మార్చారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: