ఈరోజు అసెంబ్లీ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా  కేంద్ర బడ్జెట్లో పలు  కీలక నిర్ణయాలను ప్రకటించారు నిర్మల సీతారామన్. ఇక  కేంద్ర బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలకు  సరైన నిధులు కేటాయించకపోవడంతో నిరాశే ఎదురైంది. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అత్యధిక నిధులు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి.  జిఎస్టి పై కూడా కీలక వ్యాఖ్యలు చేసారు  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. జీఎస్టీ అమలు చేయడం ద్వారా కలిగే లాభాల గురించ పార్లమెంట్ వేదికగా వివరించారు. జిఎస్టి అమలు ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదంటూ  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. 

 

 

 జీఎస్టీ లోని సమస్యల పరిష్కారానికి జిఎస్టి కౌన్సిల్ శరవేగంగా పనిచేస్తుంది అంటూ నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జిఎస్టి స్లాబ్ ల  తగ్గింపుతో కూడా సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇక  దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం కోసం అమలులోకి తెచ్చిన జి.ఎస్.టి వల్ల... సామాన్య ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా స్లాబులు తగ్గింపు తర్వాత వారి నెలవారీ ఖర్చులు 4 శాతం మేర ఆదా చేసుకోగలుగుతున్నారని ... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.అదే సమయంలో జిఎస్టి కిందికి కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారని తెలిపారు. 

 

 

 ఇప్పటివరకు జీఎస్టీ ద్వారా లక్ష కోట్ల ఆదాయం ఆధా చేసుకోగలిగారు  అంటూ వివరించారు. ఈరోజు పార్లమెంట్ వేదికగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా... జీఎస్టీ విధానాన్ని ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెక్పోస్టుల విధానానికి చెక్ పెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాము అంటూ తెలిపారు నిర్మల సీతారామన్. ట్రాన్స్ పోర్టు లాజిస్టిక్ రంగాల్లో  జీఎస్టీ పనితీరు సమర్ధవంతంగా ఉంది అని తెలిపారు . సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు జిఎస్టి విధానంతో ఎంతో మేలు జరిగిందని తెలిపారు. అంతే కాకుండా ఇప్పటి వరకు 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలు అయినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: