కోటి ఆశలతో ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ సామాన్యులకు నిరాశనే మిగిల్చింది. అసలు బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఇంకేమీ ఉండదు అన్నట్టుగా ప్రతిసారి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్ర బడ్జెట్ లో నిత్యావసరాల ధరలు తగ్గి సామాన్యుల జీవితం సాఫీగా సాగేలా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ప్రతిసారి సామాన్యుడు ఆశపడుతూనే ఉన్నా నిరాశ ఎదురవడం జరుగుతూ వస్తోంది. కూరగాయలు పండ్లు దగ్గర నుంచి అన్నీ  పెరిగిపోయి సామాన్య ప్రజల జీవితం పూర్తిగా తలకిందులవు తూ వస్తోంది. ఆర్థిక మాంద్యం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు 5 శాతం ఉండడమే గగనం అవుతున్న నేపథ్యంలో వృద్ధిరేటును పది శాతానికి టార్గెట్ గా పెట్టడంతో దానిని ఏవిధంగా సాధించాలి అనే విషయాన్నిపేర్కొనలేదు.

 

 ప్రస్తుతం చూస్తే నిత్యావసరాల ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వీటిని ఏ విధంగా తగ్గిస్తారు అనే విషయాన్ని బడ్జెట్లో చెప్పలేదు. కేవలం అంకెల గారడీలో బడ్జెట్లో మాయాజాలం చేసి ఆర్థికమాంద్యంపై చేతులెత్తేయడంపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక మాంద్యం విషయంలో బడ్జెట్ లో సరైన క్లారిటీ ఇవ్వలేకపోవడంతో  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రజలు ఆదాయాలను మెరుగుపరచడం బడ్జెట్ లక్ష్యం అంటూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శక్తిని బాగా పెంచుతామని ఆ విధంగా సంస్కరణలు తీసుకొస్తాం అంటూ ప్రకటించారు. 

 


లోక్ సభలో రెండున్నర గంటలకు పైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల సీత రామన్ గ్రామీణ వ్యవసాయ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. అలాగే ఆదాయం చెల్లింపులు అనేక మార్పులు తీసుకువచ్చారు. మధ్య తరగతి వర్గాలకు వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ బడ్జెట్లో ధరలు పెరిగేవి ఫర్నిచర్, ఎక్సైజ్ డ్యూటీ, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వైద్య వైద్య పరికరాలతో ఆటో మొబైల్‌ విడిభాగాలకు పెరిగిన కస్టమ్స్‌ సుంకం.ఇక ధరలు తగ్గేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ విడిభాగాల పన్ను తగ్గింపు, ప్లాస్టిక్, టెక్స్ టైల్స్ సెక్టర్ పై ప్రస్తుతం ఉన్న యాంటీ డంపింగ్ డ్యూటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించే విధంగా బడ్జెట్లో సంస్కరణలు ప్రవేశ పెట్టలేదని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: