ఈరోజు పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా నేడు  కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ను పార్లమెంటు వేదికగా చదివి వినిపించారు.ఇక  బడ్జెట్పై అన్ని రాష్ట్రాల  ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకుని... తమ రాష్ట్రానికి సరైన నిధులు కేటాయిస్తారని  ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు . బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలకు సరైన నిదులు  కేటాయించినప్పటికీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం నిరాశ ఎదురైంది అని చెప్పాలి. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిధులు అతి తక్కువ మొత్తంలో కేటాయించారు.

 

 

ముక్యంగా  తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్ తో నిరాశ ఎదురైంది అని చెప్పాలి. తెలంగాణ ఆశలపై  కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లినట్లు అయింది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాలేశ్వరం ప్రాజెక్టుకు కనీసం హోదా ఇవ్వలేదు కేంద్ర బడ్జెట్లో. ఇప్పటికీ కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని టిఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయినప్పటికీ కాలేశ్వరం ప్రాజెక్టుకు హోదా ఇవ్వకపోవడం నిధులు కూడా కేటాయించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేశారు. 

 

 

 

 తెలంగాణ కోరుకున్న ఏ ఒక్క అంశాన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదు అంటూ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కోరిన ఏ అంశం గురించి కూడా ప్రస్తావించలేదు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో  తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా కల్పించకుండా  నిధులు కేటాయించకుండా కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు  కూడా కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచారు. తెలంగాణ జాతీయ రహదారులు సహా  పారిశ్రామిక కారిడార్ గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదని... రైతులకు అనుకూలంగా తమ బడ్జెట్ ప్రవేశ పెట్టామని చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు మాత్రం ప్రత్యేక హోదా కనిపించలేదు అంటూ విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం సరైనది కాదు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: