కేంద్ర ప్రభుతం శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్రం తీపికబురు చెప్పింది. .విమానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కొత్తగా కిసాన్ ఉడాన్ కార్యక్రమం తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామాన్ తెలిపారు.ఉద్యానవన పంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ ను మరింత సరళం చేస్తామని చెప్పారు.  6.11 కోట్ల మంది రైతులకు బీమా సదుపాయం కల్పిస్తామని అన్నారు. కిసాన్ క్రెడిట్ స్కీమ్ కోసం రూ.15 లక్షల కోట్లు వ్యయం చేస్తామని ఆమె తెలిపారు.

 

సాగు, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు 16 సూత్రాల కార్యాచరణ ప్రకటించింది.  2020 సార్వత్రిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అందిస్తున్నామన్నారు. వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే తమ లక్ష్యమనీ.. వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలని ఆమె పేర్కొన్నారు. కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 

 

దేశంలో కరువు పరిస్థితులు ఉన్న వంద జిల్లాలను గుర్తించి ,అక్కడ నీటి సదుపాయాలు కల్పించాలని కేంద్రం ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.విమానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కొత్తగా కిసాన్ ఉడాన్ కార్యక్రమం తీసుకుంటున్నామని అన్నారు. రైతులను రాజును చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే రైతులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రైతు సంక్షేమ ప్రథకాలను రాష్ట్రాలు యథావిధిగా అమలు చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: