కేంద్ర బడ్జెట్ లో కొన్ని కీలక రంగాలను ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ పూర్తిగా విస్మరించారు . వాటిలో అత్యంత కీలకమైన  ఆటోమొబైల్ ,  స్థిరాస్తి రంగాలు  ఉండడం విశేషం . జీఎస్టీ అమలు తరువాత అమ్మకాలు లేక విల,విలలాడుతోన్న ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా  ఆర్ధికమంత్రి చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు . కానీ ఆటోమొబైల్ రంగాన్ని నిర్మలాసీతారామన్ పూర్తిగా విస్మరించడం ...  ఆ  రంగానికి చెందినవారిని తీవ్ర నిరాశకు గురి చేసింది .

 

ఆటోమొబైల్ రంగం పై  కేంద్ర ఆర్ధికమంత్రి నోటి నుంచి ...  జీఎస్టీ తగ్గింపు ప్రకటన వెలువడకపోవడంతో స్టాక్ మార్కెట్లు  నష్టాల్లోకి జారుకున్నాయి  .  దీనితో బడ్జెట్ పై ఆటోమొబైల్ రంగానికి చెందిన వారు పెదవి విరుస్తున్నారు . జీఎస్టీ నుంచి ఎంతోకొంత తమకు మినహాయింపు లభిస్తుందని భావించామని కానీ,  ఆ దిశగా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిరాశకు గురిచేసిందని హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువ పారిశ్రామికవేత్త పేర్కొన్నారు . ఆటోమొబైల్ రంగంతోపాటు , టెలికం కంపెనీల  గురించి కూడా బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని సదరు యువ పారిశ్రామికవేత్త అన్నారు .

 

ఇక స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించే విధంగా సరసమైన గ్రహాలపై నిర్మలా  దృష్టి సారిస్తారని  అందరూ భావించారు కానీ ఆదిశగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం స్థిరాస్తి రంగ వ్యాపారులను నిరాశపరిచింది . ఆర్ధిక ఏకీకరణ, గ్రామీణ డిమాండ్ పుంజుకునే విధంగా ,  రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ,  ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం పట్ల స్థిరాస్తి వ్యాపారాలు బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . బడ్జెట్ ప్రసంగం లో తన రికార్డు తానే అధిగమించిన ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ , కీలక రంగాలను విస్మరించడం పట్ల నిపుణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు . 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: