నరేంద్ర మోడీ సారధ్యం లోని బీజేపీ ప్రభుత్వం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ లో, పలు కీలక అంశాలు దాదాపు రెండునర్ర గంటలపాటు ఆమె వాటిని వివరించారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఎగువ, మధ్య తరగతి వర్గాల ప్రజలకు   ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు, చేర్పులు  చేశారు నిర్మలా సీతారామన్‌.

 

    ఇందులో  ముఖ్యంగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరేట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు అమ్మంతంగా పెరగనున్నాయి. వీటితో పాటు గా వైద్య పరికరాలపై ఐదు శాతం సెస్‌, ఆటో మొబైల్‌ విడిభాగాలు,కిచెన్‌లో వాడే వస్తువులు, టేబుల్‌వేర్, సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌, కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు, వాల్‌ ఫ్యాన్స్‌, క్లే ఐరన్‌, స్కిమ్డ్‌ మిల్క్‌, కాపర్‌, స్టీలు, ఫర్నీచర్‌, చెప్పుల ధరలు కూడా పెరగనున్నాయి.

 

   ఇంకా ధరల తగ్గింపుకు  సంభందించిన వాటిలో మొబైల్‌ ఫోన్ల విడిభాగాలకు పన్ను, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ప్లాస్టిక్‌ ఆధారిత ముడిసరుకుపై కస్టమ్స్‌ పన్ను, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌కు పన్ను, టెక్స్‌టైల్‌ సెక్టార్‌పై ప్రస్తుతమున్న యాంటీ డంపింగ్‌ డ్యుటీ రద్దు చేశారు నిర్మల సీతారామన్.

 

     ఎగువ, మధ్య మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంచారు. అవి ఈ కింది విధంగా వున్నాయి 
0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ. 5-7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు
రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను
రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను
రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధించారు ఈ బడ్జెట్ లో. గతం తో పోల్చుకుంటే ఏవి సామాన్య ప్రజలకు కాస్త ఊరట నిచ్చే అంశం గానే పరిగ నించవచ్చు.

 

 

   


 

 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: